షావోమి తాజాగా తన పాపులర్ టాబ్లెట్ షావోమి ప్యాడ్ 8 ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Xiaomi Pad 8
Xiaomi Pad 8 : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల ధరలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌ల రేట్లు కూడా భారంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్ కొరత, అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల సప్లై, డిమాండ్ల మధ్య సమతుల్యత దెబ్బతింది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే చాలా కంపెనీల స్మార్ట్‌ఫోన్లు ప్రియమవ్వగా, ఆ లిస్టులోకి ఇప్పుడు టాబ్లెట్లు కూడా వచ్చి చేరాయి. ప్రముఖ టెక్ బ్రాండ్ షావోమి తాజాగా తన పాపులర్ టాబ్లెట్ షావోమి ప్యాడ్ 8 ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విశేషం ఏంటంటే, ఈ ధరల పెంపు ట్యాబ్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది.
వేరియంట్ల వారీగా కొత్త ధరలు ఇలా ఉన్నాయి
షావోమి ఈ ఏడాది మార్చిలోనే ఈ ప్యాడ్ 8 టాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అప్పట్లో దీని బేస్ వేరియంట్ అయిన 8GB RAM + 128GB మోడల్‌ను రూ.33,999 ప్రారంభ ధరతో రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు దీనిపై రూ.2,000 పెరగడంతో, కస్టమర్లు దీనికోసం రూ.35,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ కొత్త ధరలను ఇప్పటికే అప్‌డేట్ చేసింది. అదేవిధంగా, మార్కెట్లోకి రూ.36,999 ధరతో వచ్చిన 12GB RAM + 256GB వేరియంట్ ధర కూడా రెండు వేలు పెరిగి, ఇప్పుడు రూ.38,999కి చేరుకుంది.
ప్రీమియం మోడల్స్ రేట్లు కూడా అప్
కేవలం బేసిక్ మోడల్స్ మాత్రమే కాకుండా, ఈ సిరీస్‌లోని ప్రీమియం వేరియంట్లపై కూడా కంపెనీ రేట్లు పెంచింది. షావోమి ఫోకస్ పెన్ ప్రో వేరియంట్ గతంలో రూ.41,999కి లభించగా, ఇప్పుడు దాని ధర రూ. 43,999 కి చేరింది. అలాగే ఈ లైనప్‌లోనే అత్యంత విలాసవంతమైన మోడల్ అయిన నానో టెక్స్చర్ డిస్‌ప్లే వేరియంట్ ధర కూడా పెరిగింది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వచ్చే ఈ టాప్ మోడల్ మునుపటి ధర రూ.38,999 కాగా, ఇకపై ఇది రూ.40,999కి లభించనుంది. మొత్తంగా చూసుకుంటే కంపెనీ ప్రతీ వేరియంట్‌ను రూ.2,000 మేర ఖరీదుగా మార్చేసింది.
Moolyam OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన పవర్‌ఫుల్ సోషల్ డ్రామా మూల్యం.. ఎక్కడ చూడాలంటే?
ధర పెరిగినా తగ్గని ఫీచర్ల పవర్
ధరలు పెరిగినప్పటికీ, పర్ఫార్మెన్స్ విషయంలో ఈ టాబ్లెట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. షావోమి ప్యాడ్ 8 లో 11.2 ఇంచుల అద్భుతమైన డిస్‌ప్లేను అందించారు. ఇది మైండ్ బ్లోయింగ్ 3.2K రెజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. అంతేకాకుండా, ఇండోర్, అవుట్‌డోర్లలో స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇందులో ఇచ్చారు. మల్టీటాస్కింగ్, గేమింగ్ కోసం ఈ ట్యాబ్ లో అధునాతన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి తోడు 12GB వరకు LPDDR5T RAM, 256GB వరకు UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది.
భారీ బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ విశేషాలు
ఈ టాబ్లెట్ మరో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ లైఫ్. ఎక్కువ సమయం బ్యాకప్ ఇచ్చేందుకు ఇందులో ఏకంగా 9200mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉండటం వల్ల ట్యాబ్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. సినిమా ప్రియుల కోసం ఇందులో డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ ఇచ్చారు, ఇది థియేటర్ లాంటి ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఈ డివైజ్ షావోమి సరికొత్త హైపర్ ఓఎస్ 3 పై రన్ అవుతుంది. నోట్స్ రాసుకోవడానికి మరియు డ్రాయింగ్స్ వేసుకోవడానికి వీలుగా కంపెనీ దీనితో పాటు ఫోకస్ పెన్ ప్రో స్టైలస్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. మంచి ఫీచర్లు ఉన్నప్పటికీ, సడన్‌గా రెండు వేల రూపాయలు పెరగడం కస్టమర్లకు కాస్త నిరాశ కలిగించే విషయమే.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
iPhone 18 Pro, iPhone 18 Pro Max Sale Today: India Price, Offers, and Everything Else You Need to Know