TRAI Partnership with Google and Meta to curb Spam Calls: వాట్సాప్ యాజమాన్య సంస్థ అయిన మెటా, ఆండ్రాయిడ్ ఫోన్ డయలర్ సాఫ్ట్‌వేర్ అందించే గూగుల్ ప్రతినిధులతో ట్రాయ్ అధికారులు ఇప్పటికే పలు విడతల చర్చలు జరిపారు.
Photo Credit: Pixabay
TRAI WhatsApp
TRAI Partnership with Google & Meta to curb Spam Calls: ప్రస్తుత రోజుల్లో మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య అయాచిత స్పామ్ కాల్స్, మోసపూరిత మెసేజ్‌లు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రకరకాల ప్రమోషనల్ కాల్స్, లోన్ ఆఫర్లు అంటూ వచ్చే మెసేజ్‌లతో సామాన్య వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భారత ప్రభుత్వ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా టెక్ దిగ్గజాలు అయిన మెటా, గూగుల్ సంస్థలతో ట్రాయ్ కీలక చర్చలు జరుపుతోంది. దీనికోసం ఒక అధునాతన సాంకేతిక వ్యవస్థను రూపొందించాలని ప్రతిపాదిస్తోంది.
గూగుల్, మెటాతో చేతులు కలిపిన ట్రాయ్..
ప్రముఖ బిజినెస్ పత్రిక మింట్ ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం.. వాట్సాప్ యాజమాన్య సంస్థ అయిన మెటా, ఆండ్రాయిడ్ ఫోన్ డయలర్ సాఫ్ట్‌వేర్ అందించే గూగుల్ ప్రతినిధులతో ట్రాయ్ అధికారులు ఇప్పటికే పలు విడతల చర్చలు జరిపారు. ఈ సరికొత్త ప్రతిపాదిత వ్యవస్థ ప్రకారం.. వినియోగదారులు తమ వాట్సాప్ లేదా గూగుల్ ఇన్‌బిల్ట్ ఫోన్ డయలర్ లో ఏదైనా నంబర్‌ను స్పామ్ అని రిపోర్ట్ చేసినప్పుడు, ఆ సమాచారం నేరుగా టెలికాం ఆపరేటర్ల సిస్టమ్‌కు, ట్రాయ్ అధికారిక ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుంటుంది. దీనివల్ల నిరంతరం ప్రజలను ఇబ్బంది పెట్టే నంబర్లను చాలా సులభంగా, వేగంగా గుర్తించే అవకాశం లభిస్తుంది.
ట్రాయ్ డీఎన్‌డీ పోర్టల్‌కు గూగుల్ డయలర్ లింక్..
ప్రస్తుతం యూజర్లు వాట్సాప్ లో లేదా ఫోన్ వస్తున్నప్పుడు స్పామ్ అని బ్లాక్ చేస్తే, ఆ డేటా కేవలం ఆయా యాప్స్ సర్వర్లకే పరిమితం అవుతోంది. కానీ కొత్త విధానంలో ఈ ఫిర్యాదులను టెలికాం పరిశ్రమకు చెందిన డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ప్లాట్‌ఫారమ్‌తో పాటు ట్రాయ్ కి చెందిన డూ నాట్ డిస్టర్బ్ పోర్టల్‌కు నేరుగా అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం టెలికాం ఆపరేటర్లు కమర్షియల్ మెసేజ్‌లను పర్యవేక్షించడానికి ఈ డీఎల్టీ ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నారు. ఇప్పుడు గూగుల్, వాట్సాప్ డేటా కూడా దీనికి తోడైతే, ఒకే నంబర్ నుంచి పదే పదే వచ్చే స్పామ్ కాల్స్ పై టెలికాం కంపెనీలు తక్షణమే కఠిన చర్యలు తీసుకునే వీలుంటుంది.
Hero Vida VX2 Plus : ఈవీ మార్కెట్లోకి హీరో కొత్త బాంబ్.. 187 కి.మీ రేంజ్‌తో విడా VX2 ప్లస్ 4.4 kWh లాంచ్
నకిలీ ప్రమోషనల్ కాల్స్‌తో విసిగిపోయారా..?
వాట్సాప్ లో వస్తున్న బిజినెస్, ప్రమోషనల్ మెసేజ్‌ల డేటాను టెలికాం కంపెనీలతో పంచుకోవడం పైనే ట్రాయ్ ప్రధానంగా దృష్టి పెట్టింది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్ కాల్స్ తో సమానంగా వాట్సాప్ కాల్స్, చాట్స్ ద్వారా కూడా మోసాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మెటా, గూగుల్ సంస్థలతో ఈ ఆఫర్ పై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని, దీనిపై కంపెనీల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదన గనుక అమల్లోకి వస్తే, భవిష్యత్తులో మొబైల్ వినియోగదారులకు స్పామ్ ఫిర్యాదుల ప్రక్రియ మరింత సులభతరం కావడమే కాకుండా, నకిలీ కాల్స్ చేసే కేటుగాళ్లపై చట్టపరమైన చర్యలు కూడా అంతే వేగంగా అమలవుతాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Vivo Buds Clip Launch Date Confirmed for September 21, Colour Options Revealed