Photo Credit: Google Play
భారతీ ఎయిర్‌టెల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ Zee5తో భాగస్వామ్యం తీసుకున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో ఎయిర్‌టెల్ Wi-Fi ప్లాన్‌లలో రూ. 699 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం తీసుకున్న చందాదారులందరూ Zee5 కంటెంట్ ఉచిత యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ OTT ప్లాట్‌ఫారమ్ 1.5 లక్షల గంటల కంటే ఎక్కువ కంటెంట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఉదాహరణకు రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ Wi-Fi ప్లాన్ వినియోగదారులకు ఉచిత Zee5 సబ్‌స్క్రిప్షన్ రూ. 599గా ఉంది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ప్రకటించిన ప్లాన్‌పై ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌తోపాటు మరెన్నో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లకు యాక్సెస్ కలిగి ఉన్నారు.
ఇతర సంస్థల నుంచి వస్తోన్న పోటీని తట్టకుని, తమ కస్టమర్‌లకు మెరుగైన సేవలను అందించేందుకు ఎయిర్‌టెల్ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా, ఇటీవలే ఎయిర్‌టెల్ Zee5తో భాగస్వామ్యం పొందినట్లు ప్రకటించింది. దీంతో Zee5 నుంచి అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌ను ఎయిర్‌టెల్ Wi-Fi ప్లాన్ వినియోగదారులకు రూ. 699 ప్లాన్‌తో యాక్సెస్ ఇచ్చింది. దీంతోపాటు రూ. 899, రూ. 1,099, రూ. 1,599, రూ. 3,999 ఆఫర్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు ఇతర కంపెనీలతో పోల్చి చూసినప్పుడు తక్కువగా ఉన్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. దీనిపై వినియోగదారుల నుంచి కూడా మంచి స్పందన వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
వినియోగదారులు రూ. 699, రూ. 899 ఉన్న ప్లాన్‌లతో ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్‌ను పొందుతారు. అయితే రూ. 1,099 ప్లాన్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. రూ. 1,599, రూ. 3,999 లాంటి ఎయిర్‌టెల్ వై-ఫై పెద్ద ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. అన్ని ప్లాన్‌లు కూడా 20 కంటే ఎక్కువ ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తోంది.
అనేక OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్ మాత్రమే కాకుండా, ఈ ఎయిర్‌టెల్ Wi-Fi ప్లాన్‌లు వినియోగదారులకు 40Mbps నుండి 1Gbps వరకు వేగాన్ని అందిస్తుంది. అంతేకాదు, 350 కంటే ఎక్కువ HD, SD TV ఛానెల్‌లను చూడటానికి వీలు కల్పిస్తుంది. వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్‌లలో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా ఎయిర్‌టెల్ ఇండియా వెబ్‌సైట్ నుండి ప్లాన్‌లను పొందే అవకాశం కల్పించారు.
Zee5 భాగస్వామ్యంతో Airtel బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లు సామ్ బహదూర్, RRR, Sirf Ek Bandaa Kaafi Hai, Manorathangal, Vikkatakaviలతోపాటు అనేక ఇతర చిత్రాలకు చూసేందుకు అవకాశం పొందనున్నట్లు ఈ టెలికాం ఆపరేటర్ స్పష్టం చేసింది. ఉచిత యాక్సెస్ ప్లాట్‌ఫారమ్‌లోని అన్ని ఒరిజినల్ షోలు, OTT సినిమాలు, టీవీ సిరీస్, ఇతర అన్ని కంటెంట్‌లను చూడటానికి వినియోగదారులను అనుమతి ఇస్తుంది. మరి ఎయిర్‌టెల్ తీసుకొస్తోన్న ఈ సరికొత్త సేవలను వినియోగదారులను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.
ప్రకటన
ప్రకటన