5g

5g - ख़बरें

  • త్వరలోనే ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo T4x 5G లాంఛ్‌.. ధ‌ర ఎంతో తెలుసా
    త్వ‌ర‌లోనే Vivo T4x 5G మొబైల్ భార‌త్‌లో లాంఛ్ అవుతుంద‌ని టీజ్ చేయబడింది. ధర, స్పెసిఫికేషన్‌లు, లాంచ్ టైమ్‌లైన్‌తోపాటు హ్యాండ్‌సెట్ గురించిన‌ అనేక వివరాలు ఆన్‌లైన్‌లో బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. రానున్న‌ మార్చిలో ఈ ఫోన్ ఇండియా మొబైల్ మార్కెట్‌లోకి రావ‌చ్చ‌ని లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే, అధికారిక టీజర్‌లో మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్న‌ట్లు సూచిస్తోంది. అంతే కాదు, ఇది అందుబాటు ధ‌ర రేంజ్‌లోనే ఉంటుంద‌ని కూడా తెలుస్తోంది. Vivo T4x ఫోన్‌ను పెద్ద బ్యాటరీతో రూపొందించిన‌ట్లు టీజ్ చేయబడింది.
  • Redmi Note 14 5G ఐవీ గ్రీన్ కలర్ వేరియంట్ భారత్‌లో లాంఛ్‌.. ధర, స్పెసిఫికేషన్‌లు ఇవే..
    మ‌న దేశంలో Redmi Note 14 5G ఇప్పుడు స‌రికొత్త ఫిన్షింగ్‌తో అందుబాటులోకి వ‌చ్చింది. ఈ హ్యాండ్‌సెట్ డిసెంబర్ 2024లోనే భార‌త్‌లో Mystique White, Phantom Purple, Titan Black షేడ్స్‌లో క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో ప‌రిచ‌యం అయ్యింది. కొత్త క‌ల‌ర్ ఆప్ష‌న్‌ మొబైల్‌లోని కిల‌క స్పెసిఫికేషన్స్‌ల‌ను చూస్తే.. ఇది 6.67-అంగుళాల డిస్‌ప్లే, MediaTek Dimensity 7025-Ultra ప్రాసెసర్‌, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ల‌ను అందించారు. ఇది 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110mAh బ్యాటరీతో IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.
  • రూ. 10,000 కంటే తక్కువ ధరలో Samsung నుంచి వ‌స్తోన్న 5G స్మార్ట్ ఫోన్ Galaxy F06 5G
    మ‌న దేశంలో Samsung అత్యంత సరసమైన 5G స్మార్ట్ ఫోన్‌గా Galaxy F06 5G విడుద‌ల చేసింది. దీని ప్రారంభ ధర దీనిని రూ. 10,000 కంటే తక్కువగా ఉండ‌నుంది. నిజంగా ఇది Samsung నుంచి బంప‌ర్ ఆఫ‌ర్ అనే చెప్పాలి. ప్ర‌ధానంగా OEMలకు మాస్ మార్కెట్‌గా పరిగణించబడే వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ మోడ‌ల్‌ను కంపెనీ ప‌రిచ‌యం చేసిన‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ ధ‌ర రేంజ్‌లో Samsung లెటెస్ట్ స్మార్ట్ ఫోన్ నుంచి ఆశించే అన్ని ర‌కాల ఫీచ‌ర్స్‌నూ అందిస్తోంది.
  • వచ్చే నెలలో ముంబైలో 5G సేవ‌ల‌ను ప్రారంభించ‌నున్న‌ వొడాఫోన్ ఐడియా (Vi) కంపెనీ
    భార‌త్‌లో వోడాఫోన్ ఐడియా (Vi) త‌మ‌ 5G సేవలను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ టెలికాం ఆపరేటర్ తమ‌ Q3 2024-25 నివేదికలో రాబోయే ప్రణాళికలను వెల్లడించింది. మొద‌ట‌గా మార్చిలో 5G సేవల ముంబైలో ప్రారంభించనున్న‌ట్లు తెలిపింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో మరో నాలుగు నగరాలకు ఈ సేవలను విస్తరించ‌నున్న‌ట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర్ 2024లో Vi మొదట దేశవ్యాప్తంగా 19 సర్కిల్‌లలో 5G ఆపరేషన్‌ను ప్రారంభించింది. అయితే, ఆ సమయంలో అవి వాణిజ్యపరంగా అందుబాటులోకి రాలేదు. అయితే, ఎయిర్‌టెల్, జియో రెండు సంస్థ‌లూ 2022లోనే 5G సేవలను ప్రారంభించాయి.
  • Vivo T4x 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర రేంజ్‌తోపాటు కీల‌క స్పెసిఫికేష‌న్స్ లీక్‌
    బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో Vivo T4x 5G గతంలోనే కనిపించ‌డంతోపాటు మ‌న‌ దేశంలో దీని లాంఛ్‌ త్వరలోనే ఉంటుంద‌ని సూచించింది. తాజాగా, ఒక నివేదిక ప్ర‌కారం.. అంచనా వేసిన లాంచ్ టైమ్‌లైన్‌తోపాటు ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన ప‌లు కీల‌క స్పెసిఫికేష‌న్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందుబాటు ధ‌ర రేంజ్‌తోపాటు క‌ల‌ర్ ఆప్ష‌న్‌లు, డిజైన్‌కు సంబంధించిన అంశాలు కూడా వెల్ల‌డ‌య్యాయి. రాబోయే Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ గ‌త ఏడాది ఏప్రిల్‌లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెస‌ర్‌తో దేశంలో విడుద‌లైన‌ Vivo T3x 5Gకి కొన‌సాగింపుగా వ‌స్తున్న‌ట్లు చెబుతున్నారు.
  • మ‌న దేశంలో Samsung Galaxy F16 ధర, స్పెసిఫికేషన్‌ల‌ను లీక్ చేసిన టిప్‌స్టర్‌..
    త్వ‌ర‌లోనే మ‌న దేశంలో Samsung Galaxy F16ను లాంఛ్ చేసే అవ‌కాశం ఉంది. అయితే, ఈ దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇంకా ఖచ్చితమైన లాంఛ్‌ తేదీని ప్ర‌క‌టించ‌లేదు. కానీ, Galaxy F16 హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌ల‌తోపాటు దీని ధర పరిధిని ఇప్పటికే ఓ టిప్‌స్టర్ లీక్ చేశారు. రాబోయే Galaxy F16 ఫోన్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెస‌ర్‌ను అందించే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. అలాగే, ఇది ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. Galaxy F16 మోడ‌ల్‌ Galaxy A16 5G రీబ్రాండెడ్ వెర్షన్‌గా విడుద‌ల చేయొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.
  • ఇండియాలో iQOO Neo 10R లాంచ్ ఫిక్స్.. 144Hz స్క్రీన్, 90FPS గేమింగ్ సపోర్ట్‌తో వ‌చ్చే అవ‌కాశం..
    త్వ‌ర‌లోనే iQOO Neo 10R భారత్‌లో లాంచ్ కానున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఇది కంపెనీ ప్రత్యేక R బ్యాడ్జ్ క‌లిగిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. ఇప్ప‌టికే కంపెనీ ఫోన్ లాంచ్‌ను ధృవీకరించడంతోపాటు కీలక స్పెసిఫికేషన్‌ల‌ను వెల్ల‌డించింది. అలాగే, రాబోయే iQOO Neo 10R గురించిన ప‌లు వివరాలను ఓ టిప్‌స్టర్ కూడా వెలుగులోకి తెచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ 1.5K OLED స్క్రీన్, 6,400mAh బ్యాటరీతోపాటు కంపెనీ X-యాక్సిస్ లీనియర్ మోటార్ ద్వారా శక్తినిచ్చే హాప్టిక్స్‌తో రావచ్చని భావిస్తున్నారు.
  • ఇండియాలో iQOO Neo 10R 5G లాంచ్ టైమ్‌లైన్, ధర గురించిన కీల‌క‌ సమాచారం
    తాజాగా, సోషల్ మీడియాలో ఒక టిప్‌స్టర్ అంచ‌నా ప్రకారం.. iQOO Neo 10R 5G భార‌త్‌లో ఆ కంపెనీ నుంచి వ‌స్తోన్న త‌ర్వాతి స్మార్ట్ ఫోన్‌గా విడుద‌ల కావ‌చ్చ‌ని చెబుతున్నారు. ఈ తాజా మోడ‌ల్ హ్యాండ్‌సెట్ రూ. 30,000 లోపు ధరకే లాంచ్ చేయొచ్చ‌ని కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ఫోన్ iQOO Neo 10 సిరీస్‌లో భాగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో Neo 10, Neo 10 Pro స్మార్ట్‌ ఫోన్‌లు ఉంటాయి. అయితే, ప్రస్తుతం ఇవి చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. iQOO Neo 10R 5G మోడ‌ల్‌ను మ‌న దేశీయ మార్కెట్‌లో Qualcomm's స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెస‌ర్‌పాటు 12GB వరకు RAMతో విడుదుల చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు అంచ‌నా.
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర్‌తో భార‌త్‌లో అడుగుపెట్టిన‌ Oppo Reno 13 5G, Reno 13 Pro 5G
    చైనాలో అరంగేట్రం చేసిన రెండు నెలల తర్వాత ఇండియా మార్కెట్‌లోకి Oppo Reno 13 5G, Reno 13 Pro 5Gలు విడుదల అయ్యాయి. ఈ కొత్త Reno సిరీస్ హ్యాండ్‌సెట్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర‌పై ర‌న్ అవుతాయి. అలాగే, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌లను కలిగి ఉన్నాయి. Oppo Reno 13 Pro 5Gలో సోనీ IMX890 ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. అయితే, వెనిల్లా మోడల్‌లో మాత్రం డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇవి రెండూ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తాయి
  • Poco X7 5G, Poco X7 Pro 5G వ‌రుస‌గా ఫిబ్రవరి 14, 17 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలు.. ధ‌ర ఎంతంటే
    భార‌త్‌లో Poco X7 5G సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్‌లో Poco X7 5G, Poco X7 Pro 5G స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో బేస్ మోడల్ MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తోంది. అలాగే, 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీతో వ‌స్తోంది. ఇక ప్రో వేరియంట్ MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెస‌ర్‌, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 6,550mAh భారీ బ్యాటరీని క‌లిగి ఉంది. ఇవి 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 20-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వ‌స్తున్నాయి
  • ఇండియాలోకి Tecno Pop 9 5G కొత్త 8GB RAM వేరియంట్‌.. ధ‌ర కేవ‌లం రూ. 9,499
    ఇండియా మొబైల్ మార్కెట్‌లో గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో Tecno Pop 9 5G హ్యాండ్‌సెట్‌ 4GB RAM, 64GB, 128GB స్టోరేజీతో విడుద‌లైన విష‌యం తెలిసిందే. తాజాగా కంపెనీ ఎక్కువ స‌మర్థ్యంతో కూడిన RAMతో కొత్త వేరియంట్‌ని పరిచయం చేసింది. ఈ కొత్త వేరియంట్ 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వ‌స్తోంది. అలాగే, ఇది 12GB వరకు వర్చువల్ RAMను పెంచుకునే ఫీచర్‌కు స‌పోర్ట్ చేయ‌నుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెస‌ర్‌తో రూపొందించ‌బ‌డుతోంది. అలాగే, 48-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. గ‌త‌ నవంబర్‌లో మ‌న దేశీయ మార్కెట్‌లో Tecno Pop 9 స్మార్ట్ ఫోన్ 4G వేరియంట్ లాంచ్ అయింది
  • Oppo Reno 13, Reno 13 Proల‌తోపాటు మ‌రో రెండు స్మార్ట్‌ ఫోన్‌లు గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి వ‌చ్చేస్తున్నాయి..
    గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో Oppo Reno 13, Reno 13 Pro హ్యాండ్‌సెట్‌లు చైనాలో విడుద‌లైన త‌ర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ గ్లోబల్ లాంచ్‌తో పాటు Oppo Reno 13F 5G, Reno 13F 4G అనే రెండు కొత్త వేరియంట్‌లు కూడా వ‌స్తున్నాయి. Oppo Reno 13F వేరియంట్‌లలో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌, 45W వైర్డు SuperVOOC ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 5,800mAh బ్యాటరీల‌ను అందించారు. దుమ్ము, నీటి నియంత్ర‌ణ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉన్న‌ట్లు కంపెనీ చెబుతోంది
  • కేవ‌లం రూ 9999 బ‌డ్జెట్‌లో ఇండియ‌న్ మార్కెట్‌లో అడుగుపెట్టిన‌ Redmi 14C 5G
    భార‌తీయ మొబైల్ మార్కెట్‌లోకి Redmi 14C 5G హ్యాండ్‌సెట్ అడుగుపెట్టింది. Xiaomi సబ్-బ్రాండ్ కొత్త 5G స్మార్ట్ ఫోన్ గ్లాస్ బ్యాక్‌తో మూడు క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో రానుంది. ఇది 120Hz రిజల్యూషన్‌తో 6.88-అంగుళాల డిస్‌ప్లేతో వ‌స్తోంది. అలాగే, Redmi 14C 5G ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెస‌ర్‌తో అమర్చబడి 5,160mAh సామ‌ర్థ్యం క‌లిగిన‌ బ్యాటరీని అందించారు. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ హెడ్‌లైన్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో రూపొందించారు
  • Poco X7 5G సిరీస్ డిజైన్ టీజ్ చేసిన కంపెనీ.. ముందుగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి
    Poco X7 5G సిరీస్‌ను భార‌త్ మొబైల్ మార్కెట్‌లోకి ఈ జ‌న‌వ‌రి 9న లాంచ్ చేసేందుకు కంపెనీ స‌న్నాహాలు చేస్తోంది. ఈ లైనప్‌లో బేస్ Poco X7 5Gతో పాటు Poco X7 Pro 5G వేరియంట్ ఉంది. మ‌న దేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయని స్ప‌ష్టం చేశారు. తాజాగా, రాబోయే రెండు స్మార్ట్ ఫోన్‌ల డిజైన్‌లను కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. అంతేకాదు, ప్రో మోడల్ ప్రాసెస‌ర్ వివరాలను కూడా వెల్లడించింది. Poco X7 5G సిరీస్ హ్యాండ్‌సెట్‌ల ఫీచ‌ర్స్‌కు సంబంధించి గ‌తంలోనే అనేక లీక్‌లు ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి
  • Oppo Reno 13 5G సిరీస్ ఇండియాలో త‌ర్వ‌లోనే లాంచ్‌.. డిజైన్‌తోపాటు క‌ల‌ర్ ఆప్ష‌న్స్ ఇదిగో..
    నవంబ‌ర్‌లో Oppo Reno 13 సిరీస్ చైనాలో ప‌రిచ‌య‌మైంది. ఈ లైనప్‌లో బేస్‌తోపాటు రెనో 13 ప్రో వేరియంట్‌లు ఉన్నాయి. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌లు భార‌త్ మార్కెట్‌లోకి రానున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. కంపెనీ లైనప్ నుంచి భార‌త్‌లో రాబోయే లాంచ్‌ను బ‌హిర్గ‌తం చేసింది. అంతేకాదు, ఇక్క‌డి డిజైన్‌తోపాటు క‌ల‌ర్ ఆప్ష‌న్స్‌ను, ఎప్ప‌టి నుంచి స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి లాంటి విష‌యాల‌ను వెల్ల‌డించింది. Reno 13 సిరీస్ ఇండియ‌న్ వెర్ష‌న్‌లు కూడా చైనీస్ వెర్ష‌న్స్ మాదిరిగానే ఉండ‌నున్నాయి. జూలైలో విడుద‌లైన Oppo Reno 12 Pro 5G, Reno 12 5G లలో హ్యాండ్‌సెట్‌ల కొన‌సాగింపుగా ఇవి రానున్న‌ట్లు భావిస్తున్నారు

5g - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »