Apple Watch Series 10 లాంచ్ అయింది.. సెప్టెంబర్ 20 నుంచి కొనుగోలు చేయొచ్చు
కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో జరిగిన ఆపిల్ కంపెనీ యొక్క ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్‌లో Apple Watch Series 10ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌వాచ్‌ను Apple సంస్థ రెండు వేరియంట్‌లలో ఆవిష్కరించింది. ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్ గతంలో వచ్చిన సిరీస్ కంటే సన్నగా, పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. వాచ్ యొక్క కుడి వైపున డిజిటల్ క్రౌన్‌తోపాటు ఫిజికల్ బటన్‌ను అందిస్తోంది. ఇది ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో కూడిన కొత్త చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ Apple Watch Series 10తో ఆపిల్ స్టాండర్డ్ మోడల్‌కు సపోర్ట్‌గా డెప్త్ యాప్‌ను ఎక్స్‌పెండ్ చేసింది