స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వస్తోన్న HMD Fusion హ్యాండ్‌సెట్ ప్రత్యేకతలివే
IFA 2024 ఈవెంట్‌లో తాజాగా HMD కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ HMD Fusionను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌కు స్మార్ట్ అవుట్‌ఫిట్స్ అని పిలిచే మార్చుకోగలిగిన కవర్‌లతో అటాచ్ చేయవచ్చు. ఇది ఫోనుకు సంబంధించిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను మార్చగలదు. ఈ HMD Fusion మోడల్ గరిష్టంగా 8GB RAMతో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది 108-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది. HMD Fusion మాడ్యులర్ డిజైన్‌ను కలిగి ఉండడంతో రిపేర్ చేయడం సులభంగా ఉంటుంది