త్వరలోనే vanilla Honor 300తో పాటు Honor 300 Pro కూడా లాంచ్ కాబోతోంది.. పూర్తి వివరాలు ఇవే
త్వరలోనే vanilla Honor 300తో పాటు Honor 300 Pro కూడా లాంచ్ కాబోతోంది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం ఇంకా లాంచ్ తేదీని ధృవీకరించనప్పటికీ, ఈ లైనప్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. Honor 300 సిరీస్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వస్తోంది. అలాగే, Honor 300 Pro స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రసెసర్‌తో రన్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Honor 300 Pro, Honor 300లు వరుసగా Honor 200 Pro, Honor 200 కంటే అప్‌గ్రేడ్‌లతో వస్తాయని అంచనా వేస్తున్నాయి