Honor 300 సిరీస్ లాంచ్‌కు ముందే టిప్‌స్టర్ లీక్ చేసిన కీలక స్పెసిఫికేషన్స్ ఇవే
Honor 300 సిరీస్‌ను త్వరలోనే చైనాలో పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లైనప్‌లో రాబోయే హ్యాండ్‌సెట్‌లకు సంబంధించిన పలు వివరాలు గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు, Honor 300, Honor 300 Pro మోడల్స్ కీలక స్పెసిఫికేషన్‌లు గతంలోనే బహిర్గతమయ్యాయి. బేస్ వేరియంట్‌కు చెందిన లీకైన లైవ్ ఫొటోలు దాని డిజైన్‌ను పరిచయం చేశాయి. కంపెనీ Honor 300 రంగుల ఎంపికతోపాటు పూర్తి డిజైన్‌ను సిరీస్ విడుదలకు ముందే వెల్లడించింది. అయితే, తాజాగా ఓ టిప్‌స్టర్ రాబోయే హ్యాండ్‌సెట్‌కు చెందిన RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతోపాటు కొన్ని కీలక స్పెసిఫికేషన్స్‌ను వెల్లడించారు