న్యూ Honor GT ప్రొడక్ట్స్ డిసెంబర్ 16నే లాంచ్.. ఆకర్షణీయంగా కనిపిస్తోన్న ఫోన్ డిజైన్
గత ఏడాది డిసెంబర్‌లో Honor 90 GT చైనాలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ మోడల్‌కు కొనసాగింపుగా మరో హ్యాండ్‌సెట్ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే కొత్త Honor GT ప్రొడక్ట్స్‌ను ఈ నెలాఖరులో పరిచయం చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, రాబోయే ప్రొడక్ట్ యొక్క మోనికర్‌ను మాత్రం కంపెనీ ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే, అది Honor 100 GTగా వచ్చే అవకాశం ఉన్నట్లు, దాని డిజైన్ కూడా ఫిక్స్ అయినట్లు భావిస్తున్నారు. అంతేకాదు, గతంలోనే Honor 100 GT స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించినవిగా కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్స్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే, ఇప్పటికే ఉన్న Honor 90 GT కంటే అది అప్‌గ్రేడ్ చేసిన బ్యాటరీ, ప్రాసెసర్‌ను చూపుతోంది