Infinix Note 50 సిరీస్ లాంఛ్ తేదీ ప్రకటించిన కంపెనీ.. మొదటగా ఇండోనేషియాలో విడుదల
మార్చి నెలలో Infinix Note 50 సిరీస్ లాంఛ్ కానున్నట్ల కంపెనీ ప్రకటించింది. రాబోయే స్మార్ట్ ఫోన్ లైనప్ దాదాపు ఏడాది క్రితం విడుదలైన Infinix Note 40 మోడల్‌కు కొనసాగింపుగా వస్తోంది. ఈ సిరీస్ మొదటగా ఇండోనేషియాలో విడుదల కానుంది. అలాగే, కంపెనీ పబ్లిష్ చేసిన టీజర్‌లో Infinix Note 50 సిరీస్‌లోని హ్యాండ్‌సెట్‌లలో ఒక దాని వెనుక కెమెరా మాడ్యూల్‌ను కూడా చూడొచ్చు. ఈ రాబోయే Note 50 సిరీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లకు కూడా సపోర్ట్ చేస్తుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.