రిలయన్స్ జియో కొత్త రూ. 100 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఉచిత JioHotstar సబ్‌స్క్రిప్షన్ పొందండి
మన దేశంలోని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో ఓ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కొత్త OTT ప్లాట్‌ఫామ్ JioHotstar నుండి కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకునేందుకు అవకాశాం కల్పిస్తోంది. ఇది ప్లాన్ ప్రయోజనాలతో పాటు ఉచిత JioHotstar సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. JioCinema, Disney+ Hotstar విలీనం తర్వాత ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఇటీవల భారత్‌లో లాంఛ్ చేయబడింది. ఈ ప్లాన్‌ను పొందడం ద్వారా రిలయన్స్ జియో వినియోగదారులు స్ట్రీమింగ్ సర్వీస్ నెలవారీ లేదా వార్షిక ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందాల్సిన అవసరం లేకుండా యాడ్-సపోర్ట్ గల కంటెంట్‌ను ఉచితంగా చూడొచ్చు.