OTTలోకి త్వరలో మళయాల బ్లాక్ బాస్టర్ మూవీ మార్కో.. భారీ ధరకు సొంతం చేసుకున్న Sony LIV
యువ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన యాక్షన్-డ్రామా చిత్రం మార్కో. థియేటర్‌లలో ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద రూ. 115 కోట్లకుపైగా వసూలు చేసి పలు రికార్డులను బద్దలు కొట్టింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా వైలెన్స్‌తోపాటు ఉత్కంఠభరితమైన కథనంతో రూ. 100 కోట్ల మార్కును అధిగమించిన మొదటి A- రేటింగ్ పొందిన మలయాళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అద్భుతమైన థియేటర్ రన్ తర్వాత, సంచలనాత్మక OTT ఒప్పందాన్ని చేసుకోవడం ద్వారా మరొక రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. సినిమా డిజిటల్ హక్కులను Sony LIV సంస్థ సొంతం చేసుకుంది. మలయాళ చలన చిత్ర చరిత్రలో అత్యధిక ధరను పొందినట్లు సమాచారం.