మార్కో OTT రిలీజ్ తేదీ వచ్చేసింది: ఫిబ్రవరి 14న Sony LIVలో ప్రసారం
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న మలయాళ యాక్షన్-థ్రిల్లర్ మూవీ మార్కో OTT విడుదలకు డేట్ ఫిక్స్ అయ్యింది. Sony LIVలో ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రసారం కానున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. విజయవంతమైన థియేటర్ రన్ తర్వాత ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడంతో మరింత ప్రేక్షకాధారణ పొందుతుందని భావిస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడతో సహా బహుళ భాషలలో అందుబాటులోకి రానుంది.