పిల్లలతోపాటు యువత కోసం సరికొత్త ఫోన్‌లను అందించేందుకు Xploraతో HMD ముందుకొచ్చింది
పిల్లల కోసం ప్రత్యేకమై స్మార్ట్ వాచ్‌లను అందించే నార్వేజియన్ బేసిడ్ Xploraతో HMD వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మొదలుపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ కలయిక పిల్లలు, యుక్తవయస్కుల కోసం స్మార్ట్ ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త రకం ఫోన్‌ను రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఏడాది మొదట్లో యువత స్మార్ట్‌ఫోన్ వినియోగం.. ప్రత్యామ్నాయ పరికరాలపై కంపెనీ నిర్వహించిన గ్లోబల్ సర్వే ఫలితంగా యువతకు అవసరమైన ఉత్పాదకతను పెంచే పరికరం అవసరం ఉందని తల్లిదండ్రులలో వ్యక్తమైంది. అయిఏ, కంపెనీ ఇంకా ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన మోనికర్, ప్రాబబుల్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలను ప్రకటించలేదు