OnePlus Open 2 లాంచ్ టైమ్‌లైన్ లీక్.. అనుకున్నదానికంటే ఆలస్యంగా రానుందా
OnePlus కంపెనీ రెండవ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌గా OnePlus Open 2 వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానున్నట్లు భావిస్తున్నారు. ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ 2024లో మొదటి జనరేషన్ OnePlus Openకు కొనసాగింపుగా ఎలాంటి ఫోన్‌ను పరిచయం చేయకపోవడంతో ఈ హ్యాండ్‌సెట్ 2025లో లాంచ్ చేయనున్నట్లు టిప్‌స్టర్ అంచనా వేస్తోంది. Qualcomm టాప్-ఆఫ్-ది-లైన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో 2025 ప్రారంభంలో వచ్చే అవకాశమున్న Oppo Find N5 ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానున్నట్లు భావిస్తున్నారు. మరి ఈ OnePlus Open 2కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చూసేద్దామా