50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో Poco M7 5G భారత్‌లో లాంఛ్.. ధర, స్పెసిఫికేషన్స్ చూసేయండి
ఇండియాలో Poco M7 5G హ్యాండ్‌సెట్ లాంఛ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, దుమ్ము- స్ప్లాష్ నియంత్రణకు IP52-రేటెడ్ బిల్డ్, 5,160mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. దీనికి 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అందించారు. అలాగే, ఈ ఫోన్ సెగ్మెంట్‌లో అతిపెద్ద డిస్‌ప్లేతో వస్తుందని, ట్రిపుల్ TÜV రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. ఇది గత ఏడాది డిసెంబర్‌లో మన దేశంలో విడుదలైన Poco M7 Pro 5G ఫోన్ వేరియంట్‌లో చేరింది.