మూడు ఆకర్షణీయమైన రంగుల్లో Realme 14X డిసెంబర్‌లోనే సందడి చేయనుందా
రాబోతోన్న కొన్ని వారల్లోనే Realme 14X భారత మొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టవచ్చని భావిస్తున్నారు. అయితే, కంపెనీ ఇంకా దీనికి సంబంధించి అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, ఇప్పటికే ఈ మోడల్ వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్తగా వచ్చిన నివేదిక ఆధారంగా.. Realme 14X స్మార్ట్ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌తో పాటు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లను పరిశీలించవచ్చు. ఇది హ్యాండ్‌సెట్ బ్యాటరీ సామర్థ్యంతోపాటు రంగు ఎంపికల పరంగా వినియోగదారులను ఆకర్షించేలా ప్రణాళికలు వేస్తున్నారు. Realme 14X మోడల్ Realme 14 ప్రో, Realme 14 ప్రో+ మోడళ్ల జాబితాలో చేరి, 2025 జనవరిలో ఇండియాలోని మొబైల్ మార్కెట్‌లో లాంచ్ కానున్నట్లు అంచనా వేస్తున్నారు.