Realme GT 7 లాంఛ్ టైమ్‌లైన్‌తోపాటు Realme GT 8 Pro స్పెసిఫికేషన్స్ బహిర్గతం
గతంలోనే అనేక సర్టిఫికేషన్, బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లలో కనిపించిన Realme GT 7 మోడల్ ఇప్పుడు మరొక కొత్త లీక్‌తో ప్రత్యక్షమయ్యింది. ఈ లీక్, హ్యాండ్‌సెట్ త్వరలో లాంఛ్ కావచ్చని సూచిస్తోంది. అంతే కాదు, ఫోన్‌కు సంబంధించిన అనేక కీలక స్పెసిఫికేషన్‌లను కూడా బహిర్గతం చేస్తోంది. అలాగే, ఇది నవంబర్ 2024లో చైనాలో ఆవిష్కరించబడిన Realme GT 7 Proలో జాబితాలో చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మరొక లీక్ రాబోయే Realme GT 8 Pro స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్స్‌ను సూచింస్తోంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల లాంఛ్‌ను కంపెనీ అయితే, ఇంకా ధృవీకరించలేదు.