Realme Narzo 70 Curve హ్యాండ్‌సెట్ RAM, స్టోరేజ్ వివరాలు లీక్ అయ్యాయి.. ఇదిగో
త్వరలోనే కర్వ్డ్ స్క్రీన్‌తో Realme Narzo 70 Curve హ్యాండ్‌సెట్ మార్కెట్‌లోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Realme నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, రాబోయే Narzo 70 సిరీస్ ఫోన్‌కు సంబంధించిన RAM, స్టోరేజీతోపాటు కలర్ వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. రెండు కలర్‌వేలతోపాటు నాలుగు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో Realme Narzo 70 Curve స్మార్ట్ ఫోన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సిరీస్ లాంచ్ టైమ్‌లైన్‌తోపాటు ధర విషయాలపై ఇప్పటికే పలు ఊహాగానాలు వస్తోన్న సమయంలో ఈ కొత్త లీక్ బహిర్గతమైంది. అంతేకాదు, Realme Narzo 70 సిరీస్ నాలుగు వేరియంట్‌లలో ఉంది. ఈ మోడల్‌లన్నీ MediaTek డైమెన్సిటీ ప్రాసెసర్‌పైనే రన్ అవుతున్నాయి