ఇండియా మొబైల్ మార్కెట్‌లోకి Redmi Note 14 5G సిరీస్ డిసెంబర్ 9న విడుదల
భారత మొబైల్ మార్కెట్‌లోకి Xiaomi వచ్చే నెలలో Redmi Note 14 5G సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి కంపెనీ తన సోషల్ మీడియా ఛానెల్‌లో అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే జనవరిలో లాంచయిన నోట్ 13 సిరీస్‌కు ఇది కొనసాగింపుగా రానుంది. ఇందులో బేస్, ప్రో, ప్రో+ వేరియంట్‌లలో మూడు మోడల్‌లను కలిగి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Xiaomi సబ్-బ్రాండ్ ఇప్పటికే సెప్టెంబరులో చైనాలో తాజా నోట్ 14 సిరీస్‌ను ప్రారంభించింది. భారత్‌తో సహా ఈ ఫోన్‌లను అదే తరహాలో గ్లోబల్ లాంచ్ చేయనున్నట్లు భావిస్తున్నారు.