MediaTek Dimensity 8400-Ultra ప్రాసెసర్‌తో వస్తోన్న మొదటి ఫోన్‌గా Redmi Turbo 4.. లాంచ్ ఎప్పుడంటే..
చైనాలో Redmi Turbo 4 స్మార్ట్ ఫోన్ కొత్త సంవత్సరం 2025 ప్రారంభంలో విడుదల కానుంది. అంతేకాదు, ఇదే MediaTek Dimensity 8400-Ultra ప్రాసెసర్‌తో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్‌గా కంపెనీ స్పష్టం చేసింది. ఇటీవల MediaTek తన డైమెన్సిటీ 8400 ప్రాసెసర్‌ను పరిచయం చేసింది. Realme తన భవిష్యత్ స్మార్ట్ ఫోన్‌లలో ఒకటి ఇదే ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని ఇప్పటికే ధృవీకరించింది. అది Realme Neo 7 SE ఫోన్‌గా ఓ టిప్‌స్టర్ తెలిపారు. ఇది ఈ నెల మొదట్లో చైనాలో లాంచ్ చేసిన Realme Neo 7 జాబితాలో చేర్చేలా ప్రణాళిక చేస్తున్నారు