మన దేశంలో Samsung Galaxy F16 ధర, స్పెసిఫికేషన్‌లను లీక్ చేసిన టిప్‌స్టర్..
త్వరలోనే మన దేశంలో Samsung Galaxy F16ను లాంఛ్ చేసే అవకాశం ఉంది. అయితే, ఈ దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇంకా ఖచ్చితమైన లాంఛ్ తేదీని ప్రకటించలేదు. కానీ, Galaxy F16 హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లతోపాటు దీని ధర పరిధిని ఇప్పటికే ఓ టిప్‌స్టర్ లీక్ చేశారు. రాబోయే Galaxy F16 ఫోన్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే, ఇది ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. Galaxy F16 మోడల్ Galaxy A16 5G రీబ్రాండెడ్ వెర్షన్‌గా విడుదల చేయొచ్చని అంచనా వేస్తున్నారు.