Samsung Galaxy M55s లాంచ్ డేట్ ఫిక్స్.. సెప్టెంబర్ 23న భారత్‌లో రిలీజ్
అతి త్వరలోనే Samsung Galaxy M55s హ్యాండ్‌సెట్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టనున్నట్లు ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ గెలాక్సీ M సిరీస్ స్మార్ట్‌ఫోన్ రెండు రంగులలో అందుబాటులోకి రానుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు అదే రిజల్యూషన్‌తో సెల్ఫీ కెమెరా అమర్చారు. దీనికి ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన Samsung Galaxy M55 (రివ్యూ) మాదిరి 256GB వరకు స్టోరేజీతో జత చేయబడిన స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్‌ను అందించారు