Samsung Galaxy S25, Galaxy S25+, Galaxy S25 అల్ట్రా డిజైన్‌తోపాటు స్పెసిఫికేషన్‌లు లాంచ్‌కు ముందే లీక్
ఈ జనవరి 22న Samsung తన నెక్ట్స్ జనరేషన్ Galaxy S డివైజ్‌ను Galaxy S25 సిరీస్‌గా పరిచయం చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. తాజాగా, ఓ టిప్‌స్టర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ల రెండర్‌లు లీక్ అయ్యాయి. తాజా మోడళ్లలలో వచ్చే కొన్ని డిజైన్ మార్పులు ఇందులో గమనించవచ్చు. Galaxy S25 అల్ట్రా curved cornersతోపాటు మంచి గుర్తింపు పొందిన డిజైన్ ట్వీక్‌లను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. Samsung నుంచి రాబోయే ఈ లైనప్‌లోని మూడు మోడళ్లకు సంబంధించిన పలు కీలక స్పెసిఫికేషన్స్ బహిర్గతమయ్యాయి