Exynos 2500 ప్రాసెసర్, Android 15తో Samsung Galaxy S25+ గీక్‌బెంచ్‌లో ప్రత్యక్షమైంది
Samsung అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Galaxy S25 సిరీస్ 2025 ప్రథమార్ధంలో విడుదల కానుంది. రాబోయే Galaxy S కూడా మునుపటి లైనప్‌ల మాదిరిగా వనిల్లా, ప్లస్, అల్ట్రా మోడల్‌లలో వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా Galaxy S25+ వేరియంట్‌కు సంబంధించిన కీలక వివరాలు Geekbench బెంచ్‌మార్కింగ్ సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని Galaxy S25 ఫోన్‌లకు Samsung Snapdragon ప్రాసెసర్‌లను అందిస్తుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ మోడల్‌కు సంబంధించిన పలు సరికొత్త ఫీచర్స్ సైతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి