అదిరిపోయే న్యూస్.. కేవలం రూ. 9,499లకే Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్
దేశీయ మార్కెట్‌లోకి Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఈ సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను అందించారు. ఇది NFC సపోర్ట్‌తో రూపొందించబడింది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. అలాగే, అక్టోబర్ ప్రారంభంలో కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో మన దేశంలో లాంచ్ అయిన ఆవిష్కరించబడిన Tecno Pop8కి ఈ హ్యాండ్‌సెట్ కొనసాగింపుగా వస్తోంది