పోతుగడ్డ OTT రిలీజ్: రక్ష వీరన్ దర్శకత్వం వహించిన తెలుగు థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే
అనేక వాయిదాల తర్వాత ఎట్టకేటలకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తెలుగు థ్రిల్లర్ చిత్రం పోతుగడ్డ విడుదలకు సిద్ధమైంది. రక్ష వీరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 30, 2025న OTTలోకి రానుంది. నిజానికి, నవంబర్ 2024లో మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా, ఈ సినిమా ప్రీమియర్‌ను సంక్రాంతి పండుగ తర్వాతకు వాయిదా వేసి, డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్‌పై విడుదలకు సిద్ధం చేశారు. ఓ ప్రేమ జంట ప్రయాణిస్తోన్న బస్సులో ఏం జరిగింది? రాజకీయ చదరంగంలో వారి ప్రేమ ప్రయాణం, మనుగడ కోసం సాగే పోరాటంగా ఎలా మారుతుంది? ఇలాంటి ఆసక్తికర కథాంశంతో దర్శకుడు మూవీపై మరింత ఆసక్తిని రేకెత్తించారనే చెప్పాలి.