సరికొత్త ఫీచర్స్‌తో వస్తోన్న Vivo T3 Ultra ఫీచర్స్‌తోపాటు ధరలు మీకోసం
స్మార్ట్‌ఫోన్‌ల తయారీ దిగ్గజ సంస్థ Vivo నుంచి Vivo T3 Ultra పేరుతో కొత్త మోడల్ త్వరలో దేశీయ మార్కెట్‌లోకి విడుదల కానున్నట్లు సమాచారం. అయితే, ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ వివరాలు కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అనేక లీక్‌లు, నివేదికల ఆధారంగా ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌తో పాటు RAM, స్టోరేజ్ వేరియంట్‌లు, దేశీయ మార్కెట్‌లో దీని ధరలను మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Vivo T3 Ultra దేశంలో ప్రస్తుతం ఉన్న Vivo T3 సిరీస్ ఫోన్‌ల జాబితాలో చేరవచ్చని తెలుస్తోంది