త్వరలో భారత్ మార్కెట్‌లోకి Vivo X200 సిరీస్.. ధర ఎంతంటే..
చైనాలో గత నెల Vivo X200, Vivo X200 Pro, Vivo X200 Pro Mini స్మార్ట్ ఫోన్‌లు ప్రారంభించబడ్డాయి. అయితే, ఈ మోడల్స్ గ్లోబల్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ అవుతాయన్న విషయాన్ని Vivo ఇంకా ధృవీకరించలేదు. తాజాగా భారత్‌లో వచ్చే నెల లాంచ్ ఉంటుందని లీక్ అయ్యింది. అయితే, Vivo X200 సిరీస్‌లోని అన్ని మోడల్స్ ఇండియా మార్కెట్‌లో అందుబాటులో ఉండవని తాజా నివేదికలో తెలుస్తోంది. Vivo X200 సిరీస్‌లోని స్మార్ట్ ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, ఆరిజిన్ OS 5 UI, ఫీచర్ Zeiss-బ్రాండెడ్ కెమెరాలపై రన్ అవుతాయి.