ప‌్లాన్ ధరలను అమాంతం పెంచేసిన YouTube Premium
భారతదేశంలోని YouTube Premium సబ్‌స్క్రైబర్‌లకు ఆ సంస్థ షాక్ ఇచ్చింది. తాజాగా యాడ్ ఫ్రీ కంటేంట్ కోరుకునేవారికి ధరల మోత మోగించింది. ఈ నిర్ణయంతో వ్యక్తిగత, విద్యార్థి, కుటుంబంతో సహా అన్ని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలూ పెరిగిపోయాయి. కొన్ని ప్లాన్‌లకు పెంపు తక్కువగా ఉన్నప్పటికీ, మరికొన్ని మాత్రం వాటి అసలు ధరల కంటే రెట్టింపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే టారిఫ్ చార్జీలు పెరగడంతో అయోమయంలో ఉన్న వినియోగదారులు తాజాగా YouTube Premium సబ్‌స్క్రిప్షన్ ప్రీమియం ప్లాన్స్ ధరలు పెంచడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిజానికి, YouTube Premiumతో సబ్‌స్క్రైబర్‌లు YouTube వీడియోలను యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్, హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్ వంటి ప్రయోజనాలను పొందుతారు.