సంక్రాంతికి వస్తున్నాం OTT రిలీజ్ తేదీ వచ్చేసింది.. మార్చి 1, 2025న Zee5లో ప్రసారం కానుంది
థియేటర్‌లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి, దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో దగ్గుబాటి వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద కానుల వర్షం కురిపించిన ఈ సినిమా మార్చి 1, 2025న Zee5లో ప్రచారం కానుంది. జనవరి 14, 2025న సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలో విడుదలై మంచి ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. తాజాగా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నారు.