గతేడాది నవంబర్ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టిన మహీంద్రా XEV 9S, భారత్‌లోనే రూపొందించిన మొదటి ఆథెంటిక్ 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVగా గుర్తింపు పొందింది.
Mahindra XEV 9S
Mahindra : భారత ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్యాసింజర్ ఈవీ కేటగిరీ హోల్‌సేల్ వాల్యూమ్ విక్రయాలలో మహీంద్రాకు చెందిన XEV 9S ఎలక్ట్రిక్ SUV అత్యధికంగా అమ్ముడైన వాహనంగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతంలో టాప్‌లో ఉన్న ఎంజీ మోటార్స్‌కు చెందిన విండ్సర్ ఈవీని సైతం దాటుకుని మహీంద్రా ఈ ఘనత సాధించడం విశేషం.
భారత్‌లోనే తొలి ఆథెంటిక్ 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV
గతేడాది నవంబర్ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టిన మహీంద్రా XEV 9S, భారత్‌లోనే రూపొందించిన మొదటి ఆథెంటిక్ 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVగా గుర్తింపు పొందింది. మహీంద్రాకు చెందిన సరికొత్త INGLO ఆర్కిటెక్చర్‌పై ఈ వాహనాన్ని నిర్మించారు. భారత మార్కెట్‌లో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.95 లక్షలుగా ఉంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఈ SUVలో 59 kWh, 70 kWh, 79 kWh అనే మూడు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించారు. ఇవి వరసగా 170 kW, 180 kW, 210 kW ల వరకు పీక్ పవర్ అందిస్తాయి.
ఆకర్షణీయమైన డిజైన్, విస్తారమైన స్పేస్
మహీంద్రా XEV 9S అత్యంత మోడ్రన్ అండ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో L-షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, వర్టికల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ముందు, వెనుక భాగాలలో కొత్త మహీంద్రా ఎలక్ట్రిక్ లోగో ఉన్నాయి. ఈ కారులోని ప్రధాన ఆకర్షణ భారీ కేబిన్ స్పేస్. మొదటి, రెండవ వరుసల సీట్లకు కలిపి ఏకంగా 4,076 లీటర్ల విశాలమైన స్పేస్‌ను రూపొందించారు. దీనితో పాటు లగేజీ స్టోరేజ్ కోసం 527 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.
Poco M8 Power vs Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite.. ఏది కొంటే బెస్ట్?
లగ్జరీ ఇంటీరియర్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్ SUVలో ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందించడానికి కంపెనీ అనేక ప్రీమియం ఫీచర్లను చేర్చింది. రియర్ సీట్ పాసింజర్ల కోసం బాస్ మోడ్, వెంటిలేటెడ్ అండ్ సైడ్ స్లైడింగ్ అడ్జస్టబుల్ సీట్లు, ప్రైవసీ సన్‌షేడ్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కల్పించారు. వినోదం కోసం Dolby Atmos సపోర్ట్‌తో కూడిన 16-స్పీకర్ల Harman Kardon ఆడియో సిస్టమ్, భారీ 31.24 సెం.మీ (12.3-ఇంచ్) సైజులో ఉండే మూడు డిజిటల్ స్క్రీన్‌లు, స్మార్ట్ ఫీచర్ల కోసం 5G కనెక్టివిటీ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ కోసం మహీంద్రా సొంత అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తోంది.
మహీంద్రా ఈవీ సేల్స్‌లో 124 శాతానికి పైగా వృద్ధి
పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. జూలై నెలలో భారత ప్యాసింజర్ ఈవీ మార్కెట్‌లో ఏకంగా 31,788 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 81.6 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తుంది. ఈ క్రమంలో మహీంద్రా సంస్థ ఈవీ విక్రయాల్లో ఏకంగా 124 శాతానికి పైగా వార్షిక వృద్ధి నమోదు చేసి, ఒక్క నెలలోనే 7,677 యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది.
ప్రకటన
ప్రకటన
Flipkart Freedom Sale: Nothing Phone 4a Series, Reno 15 Series, More to Be Offered at a Discount
HP OmniPad 12 Goes on Sale in India With Snapdragon Chip, Detachable Keyboard