సంగీతాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా ఆస్వాదించాలనుకునే వారి కోసం రెడ్మి హెడ్‌ఫోన్స్ నియోలో పవర్ఫుల్ 42dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌ను అందించారు.
Photo Credit: Xiaomi
Redmi Headphones Neo
Redmi : ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం షావోమీ తన ఆడియో పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ మార్కెట్లోకి సరికొత్త డివైజ్‌ను పరిచయం చేసింది. తన సబ్‌బ్రాండ్ రెడ్మి కింద మొట్టమొదటిసారిగా ఓవర్-ఈర్ హెడ్‌ఫోన్స్ రెడ్మి హెడ్‌ఫోన్స్ నియోను బుధవారం అధికారికంగా లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్లోనే ప్రీమియం ఫీచర్లను కోరుకునే మ్యూజిక్ లవర్లను టార్గెట్ చేస్తూ కంపెనీ ఈ సరికొత్త హెడ్‌ఫోన్స్‌ను డిజైన్ చేసింది. అదిరిపోయే సౌండ్ క్వాలిటీ, మోడ్రన్ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తున్న ఈ హెడ్‌ఫోన్స్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
సంగీతాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా ఆస్వాదించాలనుకునే వారి కోసం రెడ్మి హెడ్‌ఫోన్స్ నియోలో పవర్ఫుల్ 42dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌ను అందించారు. ఇది చుట్టుపక్కల ఉండే అనవసరమైన శబ్దాలను పూర్తిగా నియంత్రించి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే.. ఇందులో 40mm టైటానియం ప్లేటెడ్ డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. అంతేకాకుండా, ఇందులో డిస్టార్షన్ లేకుండా స్పష్టమైన ధ్వనిని ఇచ్చేందుకు ప్రత్యేకమైన అకౌస్టిక్ ఛాంబర్ ఉంది. ఈ హెడ్‌ఫోన్స్ 96kHz/24-bit లాస్‌లెస్ క్వాలిటీ, హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌తో వస్తాయి. యూజర్లు తమ మూడ్‌కు అనుగుణంగా మార్చుకునేందుకు ఇందులో నాలుగు రకాల ప్రీసెట్ ఈక్వలైజర్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి.
చాలా మంది హెడ్‌ఫోన్స్ ఎక్కువ సమయం పెట్టుకుంటే చెవులు నొప్పులు పుడతాయని బాధపడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా రెడ్మి కంపెనీ కంఫర్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ హెడ్‌ఫోన్స్ ఇయర్ కుషన్స్ కోసం ప్రీమియం ప్రొటీన్ లెదర్‌ను ఉపయోగించారు. కుషన్స్ లోపల సాఫ్ట్ రీబౌండ్ ఫోమ్‌ను నింపడం వల్ల వీటిని గంటల తరబడి ఎలాంటి నొప్పి లేకుండా ధరించవచ్చు. ఇక ఈ ఇయర్‌కప్స్ 110 డిగ్రీల వరకు రొటేషన్, 15 డిగ్రీల వరకు టిల్ట్ అయ్యేలా డిజైన్ చేశారు, దీనివల్ల ఇవి చెవులపై చాలా సులభంగా ఫిట్ అవుతాయి. దీని హెడ్‌బ్యాండ్ కోసం బలమైన మెటల్‌ను వాడటం వల్ల హెడ్‌ఫోన్స్‌కు మన్నికతో పాటు లగ్జరీ లుక్ వచ్చింది.
Vivo Pad 5c : టెక్ మార్కెట్లోకి వివో సరికొత్త పవర్ఫుల్ టాబ్లెట్.. అద్భుతమైన ఫీచర్లతో వివో ప్యాడ్ 5సి లాంచ్
బ్యాటరీ లైఫ్ పరంగా రెడ్మి హెడ్‌ఫోన్స్ నియో నిజంగానే ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఇందులో అమర్చిన 600mAh భారీ బ్యాటరీ సహాయంతో సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 72 గంటల పాటు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ వినవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ లాంగ్ బ్యాటరీ లైఫ్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఈ డివైజ్ స్మార్ట్ క్విక్ ఛార్జ్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ హెడ్‌ఫోన్స్‌ను కేవలం 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 5 గంటల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. అలాగే వైర్డ్ కనెక్టివిటీని ఇష్టపడే వారి కోసం ఇందులో యూఎస్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది.
షావోమీ సంస్థ ఈ సరికొత్త రెడ్మి హెడ్‌ఫోన్స్ నియోను ప్రస్తుతానికి తన హోమ్ మార్కెట్ అయిన చైనాలో విడుదల చేసింది. దీని ధరను 349 యువాన్లుగా నిర్ణయించారు. అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.5,000గా ఉంటుంది. ఈ బడ్జెట్ ధరలోనే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 72 గంటల బ్యాటరీ లైఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు లభించడం విశేషం. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ హెడ్‌ఫోన్స్‌ను జాజ్ బ్లూ, సింఫనీ వైట్, రాక్ బ్లాక్ వంటి మూడు అదిరిపోయే కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చారు. వీటిని కంపెనీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన
PS Plus Monthly Games for July Include Call of Duty: Modern Warfare 3, For the King 2 and CrossCode
Garmin Forerunner 70, Forerunner 170, Forerunner 170 Music Launched in India With 1.2-Inch Display, Up to 13 Days Battery Life