Netflix : ఓటీటీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ .. ఎలా యాక్టివ్ చేసుకోవాలంటే ?

నెట్‌ఫ్లిక్స్ సంస్థ గతంలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో, అంటే 2020వ సంవత్సరంలోనే తన 30 రోజుల ఉచిత ట్రయల్ ఆఫర్‌ను పూర్తిగా నిలిపివేసింది.

Netflix : ఓటీటీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ .. ఎలా యాక్టివ్ చేసుకోవాలంటే ?

Photo Credit: Netflix

Netflix

ముఖ్యాంశాలు
  • నెట్‌ఫ్లిక్స్ లవర్స్‌కు బంపర్ ఆఫర్
  • మళ్లీ మొదలైన 30 రోజుల ఉచిత ట్రయల్ (Free Trial) సేవలు
  • భారత్‌లో సైలెంట్‌గా సరికొత్త ఆఫర్లను టెస్ట్ చేస్తున్న ఓటీటీ దిగ్గజం
ప్రకటన

Netflix : ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతీయ వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన వార్తను మోసుకొచ్చింది. గతంలో నిలిపివేసిన అత్యంత ప్రజాదరణ పొందిన 'ఉచిత ట్రయల్' ఆఫర్‌ను భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, కొందరు కొత్త వినియోగదారులు సైన్-అప్ అవుతున్న సమయంలో  Try 30 days for ₹0, 15 రోజుల ఉచిత ట్రయల్ వంటి ఆఫర్లు స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతానికి ఈ ఆఫర్ దేశంలోని వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. ప్రముఖ టెక్ నివేదికల ప్రకారం.. యూజర్ల అకౌంట్, వారు వాడుతున్న డివైజ్ (మొబైల్/టీవీ), వారి లొకేషన్ ఆధారంగా ఈ ఆఫర్ మారుతూ వస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ సంస్థ గతంలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో, అంటే 2020వ సంవత్సరంలోనే తన 30 రోజుల ఉచిత ట్రయల్ ఆఫర్‌ను పూర్తిగా నిలిపివేసింది. ఆ తర్వాత కస్టమర్లు కచ్చితంగా డబ్బులు పెట్టి ప్లాన్ కొంటేనే కంటెంట్ చూసేలా నిబంధనలు మార్చింది. అయితే, ప్రస్తుతం ఓటీటీ రంగంలో విపరీతమైన పోటీ పెరగడంతో.. కొత్త సబ్‌స్క్రైబర్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు కంపెనీ పరిమిత స్థాయిలో ఈ ఫ్రీ ట్రయల్స్‌ను మళ్లీ పరీక్షిస్తున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. ప్రముఖ టెక్ పోర్టల్ గాడ్జెట్స్ 360 సైతం సరికొత్త ఈమెయిల్ ఐడీతో ఒక కొత్త నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను క్రియేట్ చేసి చూసినప్పుడు ఈ ఉచిత ఆఫర్ ప్రత్యక్షమైనట్లు ధృవీకరించింది. ఒకవేళ మీరు కొత్తగా సైన్-అప్ అయ్యేటప్పుడు ఈ ఆఫర్ కనిపించకపోతే.. ప్రస్తుతానికి మీ అకౌంట్ ఈ టెస్టింగ్ గ్రూప్‌లో లేదని అర్థం చేసుకోవాలి.

ఈ సరికొత్త ఫ్రీ ట్రయల్ ఆఫర్‌లో కస్టమర్లందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు లభించడం లేదు. కొంతమంది యూజర్ల అకౌంట్లలో 30 రోజుల పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ చూసే ఆప్షన్ వస్తుంటే, మరికొంతమందికి కేవలం 15 రోజుల ఉచిత ట్రయల్ ఆఫర్ మాత్రమే చూపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ కంపెనీ వేర్వేరు యూజర్ గ్రూపులపై  ఏ/బీ టెస్టింగ్ నిర్వహిస్తోందని దీనిని బట్టి స్పష్టమవుతోంది. ఈ ఉచిత ఆఫర్ ఇవ్వడం వల్ల ఎంతమంది కొత్త కస్టమర్లు పెయిడ్ సబ్‌స్క్రైబర్లుగా మారుతున్నారు? కస్టమర్లకు 15 రోజుల ఆఫర్ నచ్చుతుందా లేక 30 రోజుల ఆఫర్ నచ్చుతుందా? అనే విషయాలను విశ్లేషించుకోవడానికే కంపెనీ ఈ ప్లాన్ వేసింది.

ఒకవేళ మీరు కూడా ఈ ఉచిత నెట్‌ఫ్లిక్స్ ఆఫర్‌ను పొందాలనుకుంటే, మీ అకౌంట్ దీనికి అర్హత సాధించిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సులువైన స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మొదటగా మీ మొబైల్ లేదా లాప్‌టాప్‌లో నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌లో వాడని ఒక సరికొత్త ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేయడం ప్రారంభించాలి. సైన్-అప్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు స్క్రీన్‌పై  Try 30 days for ₹0 లేదా  15-Day Free Trial అనే బ్యానర్ కనిపిస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆఫర్ కనిపిస్తే, మీకు నచ్చిన ఏదో ఒక ప్లాన్ (మొబైల్, బేసిక్, ప్రీమియం)ను సెలెక్ట్ చేసుకోవాలి.

Samsung : మార్కెట్లోకి శాంసంగ్ సరికొత్త బడ్జెట్ ఫోన్.. అదిరిపోయే డిజైన్‌తో రానున్న గెలాక్సీ A18

ఆఫర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా సపోర్టెడ్ యూపీఐ  ఐడీని పేమెంట్ మెథడ్‌గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వినియోగదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో డిఫాల్ట్ గా  ఆటోపే సిస్టమ్ ఆన్ అయి ఉంటుంది. అంటే మీ ఉచిత ట్రయల్ పీరియడ్ (15 రోజులు లేదా 30 రోజులు) ముగిసేలోపు మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను మాన్యువల్‌గా క్యాన్సిల్ చేయకపోతే.. ట్రయల్ అయిపోయిన మరుసటి రోజే మీరు ఎంచుకున్న ప్లాన్ కాలిక్యులేషన్ ప్రకారం మీ బ్యాంక్ ఖాతా లేదా కార్డ్ నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయిపోతాయి. కాబట్టి ఉచితంగా ఎంజాయ్ చేయాలనుకునే వారు గడువు ముగియడానికి ఒక రోజు ముందే అకౌంట్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Netflix : ఓటీటీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ .. ఎలా యాక్టివ్ చేసుకోవాలంటే ?
  2. Apple : ఐఫోన్ యూజర్లకు యాపిల్ బంపర్ గిఫ్ట్.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అందుబాటులోకి క్రేజీ సర్వీస్
  3. Social Media : 16 ఏళ్ల లోపు పిల్లలకు ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌ బంద్..రూల్స్ బ్రేక్ చేస్తే రూ.280 కోట్ల జరిమానా
  4. YouTube : యూట్యూబ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వీడియోల మధ్యలో వచ్చే యాడ్స్‌కు శాశ్వతంగా చెక్ పెట్టేసిన డక్‌డక్‌గో
  5. Samsung : మార్కెట్లోకి శాంసంగ్ సరికొత్త బడ్జెట్ ఫోన్.. అదిరిపోయే డిజైన్‌తో రానున్న గెలాక్సీ A18
  6. Government Apps : ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు.. మీ ఫోన్లో కచ్చితంగా ఉండాల్సిన టాప్ 10 యాప్స్ ఇవే
  7. SIR : ఓటర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్ట్ స్పెషల్ రివిజన్ ఫేజ్-3 షెడ్యూల్ విడుదల చేసిన ఈసీఐ
  8. Super Earth : ఖగోళ శాస్త్రంలో అద్భుతం.. విశ్వంలో మరో ‘భూమి’ గుర్తింపు, అక్కడ జీవం ఉండే ఛాన్స్
  9. Xiaomi 18 Pro : ఇది నెక్స్ట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్.. 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 6 ప్రాసెసర్‌తో షియోమి 18 ప్రో
  10. iQOO Z11 Lite : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఐకూ బంపర్ ఆఫర్.. జూలై 24న భారత మార్కెట్లోకి ఐకూ Z11 లైట్ ఎంట్రీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »