షియోమి 18 ప్రో స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించబోతోంది.
Xiaomi 17 Pro
Xiaomi 18 Pro : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి గతేడాది మార్కెట్లోకి తీసుకొచ్చిన షియోమి 17 సిరీస్‌తో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లోని షియోమి 17 ప్రో, 17 ప్రో మాక్స్ మోడల్స్ వెనుక భాగంలో ఇచ్చిన సెకండరీ డిస్‌ప్లే ఫీచర్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా, ఇప్పుడు ఈ సిరీస్‌కు కొనసాగింపుగా రాబోయే కొద్ది నెలల్లోనే సరికొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్ షియోమి 18 ప్రోను లాంచ్ చేయడానికి కంపెనీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా విడుదల కాకముందే దీనికి సంబంధించిన కీలకమైన ఫీచర్లు, కెమెరా వివరాలు నెట్టింట లీకై హల్‌చల్ చేస్తున్నాయి. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వేబోలో ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ లీక్స్‌ను పంచుకున్నారు.
రెండు 200 మెగాపిక్సెల్ కెమెరాలు
లీకైన సమాచారం ప్రకారం, షియోమి 18 ప్రో స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించబోతోంది. ఇందులో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అప్‌కమింగ్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 6 సిరీస్ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ఇక ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్లో నెక్స్ట్ లెవెల్ కెమెరా సెటప్‌ను ఇస్తున్నారు. దీని వెనుక భాగంలో ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, మరో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా అమర్చబోతున్నారు. దీనివల్ల చాలా సుదూరంలో ఉన్న వస్తువులను కూడా అద్భుతమైన క్లారిటీతో, లాస్-లెస్ జూమింగ్‌తో ఫోటోలు తీసుకోవచ్చు.
7,000mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
బ్యాటరీ పరంగా కూడా ఈ ఫోన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుంది. ఇందులో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 7,000mAh భారీ బ్యాటరీని ఇస్తున్నారు. డిస్‌ప్లే విషయానికొస్తే.. చాలా సన్నని బెజెల్స్ తో కూడిన ఫ్లాట్ 2K రిజల్యూషన్ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు. అద్భుతమైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం అప్‌గ్రేడెడ్ డ్యూయల్ స్పీకర్ల సెటప్ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా, సామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో ఉండబోయే అత్యంత సురక్షితమైన సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను షియోమి తన ఈ కొత్త ఫోన్లో ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ ఫీచర్లపై షియోమి సంస్థ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
iQOO Z11 Lite : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఐకూ బంపర్ ఆఫర్.. జూలై 24న భారత మార్కెట్లోకి ఐకూ Z11 లైట్ ఎంట్రీ
షియోమి 17 ప్రో రికార్డులను తిరగరాస్తూ సరికొత్త హంగులతో రాక
గతేడాది సెప్టెంబర్‌లో చైనాలో విడుదలైన షియోమి 17 ప్రో ఫీచర్లతో పోలిస్తే కొత్త మోడల్ ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతోంది. పాత షియోమి 17 ప్రో మోడల్లో 6.3 ఇంచుల డిస్‌ప్లే, 3,500 నిట్స్ బ్రైట్‌నెస్, బ్యాక్ ప్యానెల్‌పై M10 సెకండరీ స్క్రీన్, షియోమి డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. అలాగే అందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, వెనుక వైపు మూడు 50MP కెమెరాలు (లైట్ హంటర్ 950L ప్రైమరీ, అల్ట్రా-వైడ్, పెరిస్కోప్), 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. పాత మోడల్లో 7,500mAh బ్యాటరీ ఉన్నప్పటికీ, కొత్త షియోమి 18 ప్రోలో 7,000mAh బ్యాటరీతో పాటు 200MP అల్ట్రా కెమెరాలు, నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ ఇస్తుండటంతో స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Vivo T5 Lite 5G India Launch Date Revealed Alongside Key Specifications, Features
Oppo Find N7 Leak Hints at Launch Timeline and Presence of 6,500mAh Battery, Snapdragon 8 Elite Gen 6 Chip