YouTube : యూట్యూబ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వీడియోల మధ్యలో వచ్చే యాడ్స్‌కు శాశ్వతంగా చెక్ పెట్టేసిన డక్‌డక్‌గో

ఐఓఎస్, మ్యాక్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతున్న వినియోగదారులకు ఎటువంటి అదనపు సెట్టింగ్స్ లేకుండానే నేరుగా డిఫాల్ట్‌గా అందుబాటులోకి వచ్చేసింది.

YouTube : యూట్యూబ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వీడియోల మధ్యలో వచ్చే యాడ్స్‌కు శాశ్వతంగా చెక్ పెట్టేసిన డక్‌డక్‌గో

Photo Credit: Unsplash/ appshunter.io

ముఖ్యాంశాలు
  • యూట్యూబ్ లవర్స్‌కు గుడ్ న్యూస్
  • యాడ్స్ లేని యూట్యూబ్ ప్రయాణం
  • ఐఓఎస్, విండోస్ యూజర్లకు డిఫాల్ట్‌గా లభ్యం
ప్రకటన

YouTube : మనలో చాలా మంది యూట్యూబ్‌లో వీడియోలు చూసేటప్పుడు మధ్యమధ్యలో వచ్చే విసుగు పుట్టించే ప్రకటనల వల్ల తీవ్ర అసహనానికి గురవుతుంటారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ.. ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ బ్రౌజర్ డక్‌డక్‌గో ఒక అద్భుతమైన సరికొత్త ఫీచర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ సహాయంతో వినియోగదారులు యూట్యూబ్‌లో కనిపించే దాదాపు అన్ని రకాల వీడియో యాడ్స్‌ను చాలా సులభంగా బ్లాక్ చేయవచ్చు. వీడియో ప్రారంభం కావడానికి ముందు వచ్చే యాడ్స్‌తో పాటు, వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే ఇన్‌స్ట్రీమ్ ప్రకటనలను కూడా ఇది విజయవంతంగా అడ్డుకుంటుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఐఓఎస్, విండోస్ యూజర్లకు డిఫాల్ట్‌గా లభ్యం 
డక్‌డక్‌గో తీసుకొచ్చిన ఈ అద్భుతమైన యాడ్-బ్లాకింగ్ ఫీచర్ ప్రస్తుతం ఐఓఎస్, మ్యాక్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతున్న వినియోగదారులకు ఎటువంటి అదనపు సెట్టింగ్స్ లేకుండానే నేరుగా డిఫాల్ట్‌గా అందుబాటులోకి వచ్చేసింది. అయితే, ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉపయోగిస్తున్న వారు మాత్రం ఈ ఫీచర్‌ను బ్రౌజర్ లోని  సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి మాన్యువల్‌గా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ఆన్ చేయగానే ఎటువంటి థర్డ్-పార్టీ యాడ్ బ్లాకర్ ఎక్స్‌టెన్షన్స్ డౌన్‌లోడ్ చేసుకోకుండానే యూట్యూబ్ వెబ్‌సైట్ లో ప్రకటనలు లేని క్లీన్ వీడియోలను యూజర్లు ఎంజాయ్ చేయవచ్చు.

యూబ్లాక్ ఒరిజిన్ ఫిల్టర్లతో మ్యాజిక్ 
ఈ సరికొత్త యాడ్-బ్లాకింగ్ సిస్టమ్ కోసం డక్‌డక్‌గో సంస్థ  యూబ్లాక్ ఒరిజిన్ కమ్యూనిటీ నిర్వహిస్తున్న పవర్ఫుల్ ఫిల్టర్ లిస్ట్‌లను ఉపయోగించింది. వీటికి అదనంగా కంపెనీ తన సొంత కంపాటిబిలిటీ రూల్స్‌ను కూడా జత చేయడం వల్ల ఎక్కువ ప్రకటనలను సమర్థవంతంగా అడ్డుకోవడం సాధ్యమవుతోంది. అయితే, డక్‌డక్‌గో బ్రౌజర్ లో ఇదివరకే ఉన్న డక్ ప్లేయర్ ఫీచర్‌కు, ఈ కొత్త ఫీచర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. డక్ ప్లేయర్ అనేది కేవలం యూజర్ల డేటాను ట్రాక్ చేసే కుకీలను నిరోధించి ప్రైవసీని పెంచడానికి ఉపయోగపడుతుంది. కానీ, ఈ సరికొత్త ఫీచర్ నేరుగా యూట్యూబ్ వెబ్‌సైట్ లోనే యాడ్స్ రాకుండా ఫిల్టర్ చేస్తుంది. వినియోగదారులు కావాలనుకుంటే ఈ రెండు ఫీచర్లను ఒకేసారి కూడా రన్ చేసుకోవచ్చు.

Government Apps : ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు.. మీ ఫోన్లో కచ్చితంగా ఉండాల్సిన టాప్ 10 యాప్స్ ఇవే

వీడియో లోడింగ్‌లో స్వల్ప ఆలస్యం 
ఈ సరికొత్త యాడ్ బ్లాకింగ్ ఫీచర్‌ను ఉపయోగించడం వల్ల కొన్ని సందర్భాల్లో వీడియోలు ప్లే కావడానికి సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఒకసారి వీడియో లోడ్ అయి ప్లే అవ్వడం ప్రారంభమైన తర్వాత ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాధారణ ప్లేబ్యాక్ అనుభవాన్ని పొందవచ్చు. యూట్యూబ్ సంస్థ కూడా కాలానికి అనుగుణంగా యాడ్స్ వేసే పద్ధతులను మారుస్తూ ఉంటుంది కాబట్టి, ఈ ఫిల్టర్ లిస్ట్ అప్‌డేట్ అయ్యే వరకు కొన్నిసార్లు ఈ ఫీచర్ తాత్కాలికంగా పనిచేయకపోవచ్చని కూడా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉన్నందున, బ్రౌజర్ ద్వారా  ఫీడ్‌బ్యాక్ పంపాలని డక్‌డక్‌గో యూజర్లను కోరింది. ఈ ఫీచర్‌తో డక్‌డక్‌గో బ్రౌజర్ కూడా.. ఇన్-బిల్ట్ యాడ్ బ్లాకర్స్ కలిగి ఉన్న బ్రేవ్, ఒపెరా వంటి పాపులర్ బ్రౌజర్ల సరసన చేరిపోయింది.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Motorola G37 Power 5G: మోటోరోలా బంపర్ ఆఫర్.. 7000mAh భారీ బ్యాటరీ ఫోన్‌పై ఏకంగా 47% డిస్కౌంట్
  2. iQOO Z11 : భారత్‌లోకి ఐకూ Z11 గ్రాండ్ ఎంట్రీ.. ఆగస్టు 20న లాంచ్ కాబోతున్న పవర్‌ఫుల్ 5G ఫోన్
  3. Google Pixel 11 Series Launch: ఆగస్టు 12న గూగుల్ మెగా ఈవెంట్.. నాలుగు మోడళ్లలో పిక్సెల్ 11 సిరీస్ లాంచ్
  4. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 399లకే బ్రాండెడ్ పవర్ బ్యాంక్‌లు
  5. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ధమాకా.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
  6. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 30 వేల బడ్జెట్‌లో టాప్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
  7. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. 43 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
  8. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం.. 32 ఇంచుల స్మార్ట్ టీవీలపై ఊహించని డిస్కౌంట్లు
  9. ITR Refund: ఐటీఆర్ రీఫండ్ కోసం చూస్తున్నారా? నిమిషాల్లో స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసా ?
  10. TVS Motor: టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ఐక్యూబ్, ఆర్బిటర్ ధరలు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »