సోనీ ప్లేస్టేషన్ 5, ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్/ఎక్స్ కన్సోల్స్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఈ గేమ్ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
Photo Credit: GTA 6
GTA 6
GTA 6 : గేమింగ్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన గ్రాండ్ థెఫ్ట్ ఆటో సిరీస్ నుంచి రాబోతున్న జీటీఏ 6 కోసం ఎదురుచూపులకు తెరపడింది. ఈ ప్రతిష్టాత్మక గేమ్ నిర్మాణ సంస్థ రాక్స్టార్ గేమ్స్ గేమర్లకు ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 25వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ గేమ్ ప్రీ-ఆర్డర్లు అధికారికంగా ప్రారంభం కానున్నట్లు సంస్థ ధృవీకరించింది. సోనీ ప్లేస్టేషన్ 5, ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్/ఎక్స్ కన్సోల్స్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఈ గేమ్ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రకటనతో పాటు కంపెనీ కొన్ని సరికొత్త గేమ్ స్క్రీన్షాట్లను కూడా రిలీజ్ చేసింది.
సాధారణంగా మార్కెట్లోకి వచ్చే పెద్ద AAA గేమ్స్ ధర 70 డాలర్లుగా ఉంటుంది. కానీ జీటీఏ 6 ధర అంతకంటే ఎక్కువ ఉంటుందనే ప్రచారం నిజమైంది. రాక్స్టార్ గేమ్స్ ఈ గేమ్ను రెండు ఎడిషన్లలో అందుబాటులోకి తెస్తోంది. ఇందులో స్టాండర్డ్ ఎడిషన్ ధరను 79.99 డాలర్లుగా నిర్ణయించారు, ఇది మన భారత కరెన్సీలో దాదాపు రూ.7,500గా ఉంటుంది. ఇకపోతే ఎక్స్ట్రా ఫీచర్లు ఉండే ఉల్టిమేట్ ఎడిషన్ ధరను 99.99 డాలర్లుగా పెట్టారు, అంటే మన దేశంలో దీని కోసం అక్షరాలా రూ. 9,400 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రీమియం ధర కలిగిన ఉల్టిమేట్ ఎడిషన్ను కొనుగోలు చేసే ప్లేయర్లకు గేమ్ లోపల ఎన్నో అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ప్రత్యేకమైన వెహికల్స్ (వాహనాలు), స్టైలిష్ అవుట్ఫిట్స్ (దుస్తులు), పవర్ఫుల్ ఆయుధాలు లభిస్తాయి. వీటన్నింటితో పాటు గేమ్ ప్రధాన పాత్రలైన జేసన్, లూసియాల కథకు సంబంధించిన కొన్ని అదనపు మిషన్లు, ఎక్స్ట్రా కంటెంట్ కూడా లభిస్తుంది. ప్లేయర్స్ గేమ్లో ఒక్కొక్క చాప్టర్ పూర్తి చేస్తున్న కొద్దీ ఈ స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఆటోమేటిక్గా అన్లాక్ అవుతాయని కంపెనీ తెలిపింది.
గేమ్ విడుదల కాకముందే, అంటే నవంబర్ 20 వ తేదీ లోపు జీటీఏ 6 గేమ్ను ప్రీ-ఆర్డర్ లేదా కొనుగోలు చేసే ప్లేయర్లందరికీ రాక్స్టార్ గేమ్స్ ఒక ఉచిత కానుకను అందిస్తోంది. వారికి వింటేజ్ వైస్ సిటీ ప్యాక్ ను పూర్తిగా ఉచితంగా ఇస్తారు. దీని ద్వారా 1980ల నాటి రెట్రో థీమ్తో కూడిన పాతకాలపు ఇన్-గేమ్ ఐటమ్స్ లభిస్తాయి. వీటితో పాటు డిజిటల్ పద్ధతిలో ప్రీ-ఆర్డర్ చేసే యూజర్లకు GTA+ సబ్స్క్రిప్షన్ ఒక నెల రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. దీని సాయంతో ప్లేయర్స్ జీటీఏ 5, రాక్స్టార్కు చెందిన ఇతర పాత క్లాసిక్ గేమ్లను కూడా ఉచితంగా ఆడుకోవచ్చు.
Amazon Now : అమెజాన్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్.. ఇకపై 300కు పైగా నగరాల్లో నిమిషాల్లోనే హోమ్ డెలివరీ
ఫిజికల్ గేమ్ డిస్క్లను (CDs) సేకరించడం ఇష్టపడే గేమర్లకు రాక్స్టార్ గేమ్స్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. గేమ్ లాంచ్ అయ్యే సమయంలో ఎలాంటి డిస్క్ వెర్షన్లు మార్కెట్లోకి రావు. ఒకవేళ మీరు స్టోర్స్కు వెళ్లి ఫిజికల్ బాక్స్ కొనుగోలు చేసినప్పటికీ.. ఆ బాక్స్ లోపల గేమ్ సిడీ ఉండదు, కేవలం గేమ్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడే డిజిటల్ డౌన్లోడ్ కోడ్ మాత్రమే ఉంటుంది. ఇకపోతే, ప్రీ-ఆర్డర్ చేసుకున్న ప్లేయర్స్ అందరూ గేమ్ అధికారికంగా రిలీజ్ అవ్వడానికి వారం రోజుల ముందే, అంటే 12 నవంబర్ 2026 నుంచి గేమ్ను తమ కన్సోల్స్లోకి ప్రీ-లోడ్ చేసి పెట్టుకోవచ్చు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, జీటీఏ 6 ప్రారంభంలో కేవలం సింగిల్-ప్లేయర్ స్టోరీ మోడ్తో మాత్రమే లాంచ్ కానుంది. రాక్స్టార్ గేమ్స్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ మరియు అద్భుతమైన సింగిల్-ప్లేయర్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుందని కంపెనీ ప్రెస్ రిలీజ్లో పేర్కొంది. మల్టీప్లేయర్ మోడ్ అయిన GTA Online ను గేమ్ లాంచైన కొన్ని నెలల తర్వాత విడిగా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మోస్ట్ అవేటెడ్ గేమ్ వచ్చే ఏడాది నవంబర్ 19, 2026 న ప్రపంచవ్యాప్తంగా ప్లేస్టేషన్ స్టోర్, మైక్రోసాఫ్ట్ స్టోర్, రాక్స్టార్ గేమ్స్ అఫీషియల్ స్టోర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch