Google Pixel 11a Specifications Leaked: గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఆగస్టు 2026 నాటికి మార్కెట్లోకి వస్తాయని భావిస్తుండగా ఈ బడ్జెట్ A-సిరీస్ మోడల్ పిక్సెల్ 11a మాత్రం మార్చి 2027 నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Photo Credit: Google
Google Pixel 10a
Google Pixel 11a Specifications Leaked: గూగుల్ తమ తదుపరి అఫోర్డబుల్ A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. పిక్సెల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 11a ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. టెలిగ్రామ్‌లోని ప్రముఖ టిప్‌స్టర్ సమాచారం ప్రకారం.. ఈ కొత్త పిక్సెల్ ఫోన్ ప్రాసెసర్, డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరాతో పాటు రంగుల వివరాలు బహిర్గతమయ్యాయి.
గూగుల్ పిక్సెల్ 11a ఎప్పుడు రావచ్చు..?
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఆగస్టు 2026 నాటికి మార్కెట్లోకి వస్తాయని భావిస్తుండగా ఈ బడ్జెట్ A-సిరీస్ మోడల్ పిక్సెల్ 11a మాత్రం మార్చి 2027 నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే లాంచ్ తేదీపై గూగుల్ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
సూపర్ బ్రైట్ డిస్‌ప్లే.. పవర్‌ఫుల్ టెన్సర్ G6 ప్రాసెసర్..
లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ అంతర్గత కోడ్‌నేమ్ ఫార్మోసన్. ఇందులో 6.3 ఇంచుల డిస్‌ప్లే ఉండనుంది. ఇది 1080x2424 పిక్సెల్స్ రెసొల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2,250 నిట్స్ HDR బ్రైట్‌నెస్, ఏకంగా 3,350 నిట్స్ పిక్ బ్రైట్‌నెస్‌తో రానుంది. గత మోడల్ పిక్సెల్ 10a (3,000 నిట్స్)తో పోలిస్తే ఇది మరింత ప్రకాశవంతమైన డిస్‌ప్లే కానుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో గూగుల్ నెక్స్ట్-జెన్ టెన్సర్ G6 చిప్‌సెట్‌తో పాటు మెరుగైన భద్రత కోసం టైటాన్ M3 సెక్యూరిటీ చిప్‌ను అందించనున్నారు.
Vivo X300 E Launch: వివో నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. జీస్ కెమెరాతో వివో X300 E రాక
కనెక్టివిటీలో పెద్ద మార్పు.. బ్యాటరీ, కెమెరా వివరాలు..
పిక్సెల్ ఫోన్లలో గతంలో వచ్చిన నెట్‌వర్క్, హీటింగ్ సమస్యలకు చెక్ పెడుతూ.. గూగుల్ ఈసారి శామ్‌సంగ్ ఎగ్జినోస్ మోడెమ్‌కు స్వస్తి పలికి, మీడియాటెక్ M90 మోడెమ్‌ను వాడబోతోందని సమాచారం. దీనివల్ల నెట్‌వర్క్ స్టెబిలిటీ, సిగ్నల్ కనెక్టివిటీ భారీగా మెరుగుపడతాయి. ఇందులో 8GB ర్యామ్‌తో పాటు 4,870mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉండవచ్చని తెలుస్తోంది. కెమెరా విభాగంలో దొక్కేబి అనే కోడ్‌నేమ్‌తో కొత్త ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను ఇస్తున్నట్లు లీక్ అయింది. ఈ ఫోన్ ఆబ్సిడియన్ (బ్లాక్), ఆలివ్ (గ్రీన్), ఫ్రాస్ట్ (పర్పుల్), ఫాగ్ (సిల్వర్) అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో రానుంది.
ప్రకటన
ప్రకటన
WhatsApp Adds Status Caption Editing Feature for Android Beta Testers: Report