Redmi Note 17 Pro: రెడ్‌మి నోట్ 17 ప్రో ధర ఎంత..? ఏ ఏ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుందో తెలుసా?

Redmi Note 17 Pro launched with 9000mAh Battery: చైనా మార్కెట్లో విడుదలైన ఈ సరికొత్త ప్రొఫెషనల్ వేరియంట్ కస్టమర్ల కోసం నాలుగు విభిన్న స్టోరేజ్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చింది.

Redmi Note 17 Pro: రెడ్‌మి నోట్ 17 ప్రో ధర ఎంత..? ఏ ఏ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుందో తెలుసా?

Redmi Note 17 Pro

ముఖ్యాంశాలు
  • 9,000 mAh భారీ బ్యాటరీతో 'Redmi Note 17 Pro' లాంచ్
  • స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 16, హైపర్ ఓఎస్ 3 సపోర్ట్
ప్రకటన

Redmi Note 17 Pro launched with 9000mAh Battery: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి మొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన మోస్ట్ పాపులర్ నోట్ సిరీస్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మారుస్తూ రెడ్ మీ నోట్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ సరికొత్త ప్రో మోడల్ ఫీచర్లు చూస్తే ఎవరైనా సరే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5000 mAh బ్యాటరీలను చూస్తుంటాం, కానీ రెడ్‌మి ఏకంగా 9,000 mAh సామర్థ్యం గల మోన్‌స్టర్ బ్యాటరీని ఈ ఫోన్ లో ఇచ్చి రికార్డు సృష్టించింది. చైనాలో విడుదలైన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ లో బ్యాటరీతో పాటు డిస్‌ప్లే, ప్రాసెసర్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అప్‌గ్రేడ్స్ ఇచ్చారు.

చైనా మార్కెట్లో విడుదలైన ఈ సరికొత్త ప్రొఫెషనల్ వేరియంట్ కస్టమర్ల కోసం నాలుగు విభిన్న స్టోరేజ్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఇందులో బేస్ మోడల్ అయిన 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ ధర 1,599 యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.22,700)గా ఉంది. అలాగే 8 GB + 256 GB వేరియంట్ ధర 1,899 యువాన్లు (సుమారు రూ.27,000) కాగా, 12 GB + 256 GB మోడల్ ధర 2,199 యువాన్లు (సుమారు రూ.31,200)గా నిర్ణయించారు. ఇక హై-ఎండ్ వేరియంట్ అయిన 8 GB + 512 GB స్టోరేజ్ ధర 2,299 యువాన్లు (సుమారు రూ.32,700)గా ఉంది. ఈ ఫోన్ వైట్, పర్పుల్, బ్లూ, బ్లాక్ వంటి నాలుగు క్లాసీ కలర్లలో లభిస్తోంది. ప్రస్తుతం చైనాలో రెడ్‌మి అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీని విక్రయాలు జరుగుతున్నాయి.

సాంకేతిక వివరాలు పరిశీలిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ లో 6.83 ఇంచుల పరిమాణం గల 1.5K (2,772 x 1,280 పెక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్‌ను అమర్చారు. విజువల్స్ అత్యంత స్పష్టంగా కనిపించేలా ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, ఏకంగా 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది. దీనివల్ల తీవ్రమైన ఎండలో కూడా స్క్రీన్ పై ఉన్న అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో క్వాల్కమ్ సంస్థకు చెందిన పవర్‌ఫుల్  స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్‌ను వాడారు. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ ఓన్ సాఫ్ట్‌వేర్ హైపర్ ఓఎస్ 3 పై రన్ అవుతుంది.

BSNL : బీఎస్ఎన్ఎల్ దూకుడు.. తొలి త్రైమాసికంలో 10 శాతం పెరిగిన కంపెనీ ఆదాయం

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం రెడ్ మీ నోట్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు అదిరిపోయే డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో f/1.8 అపర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ ప్రైమరీ కెమెరాతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ (పోర్ట్రెయిట్ షాట్స్) కోసం 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను జత చేశారు. ఇక సెల్ఫీలు, హై-క్వాలిటీ వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ లోని ఫ్రంట్,బ్యాక్ కెమెరాల ద్వారా వినియోగదారులు 1,080p క్వాలిటీతో చాలా స్మూత్‌గా వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ పరంగా ఇందులో స్క్రీన్ పైనే అన్‌లాక్ చేసుకునేలా వేగవంతమైన ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‎ను ఇచ్చారు.

రెడ్ మీ నోట్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లోని అన్నింటికంటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దీనిలోని 9,000 mAh మైటీ బ్యాటరీ. హెవీగా గేమింగ్ ఆడినా లేదా రోజంతా సినిమాలు చూసినా సరే, ఈ బ్యాటరీ బ్యాకప్ సులభంగా రెండు మూడు రోజులకు పైనే వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇంత పెద్ద బ్యాటరీని అంతే వేగంగా ఛార్జ్ చేయడానికి కస్టమర్ల కోసం 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందించింది. దీనితో పాటు అత్యవసర సమయాల్లో మీ ఇతర చిన్నపాటి గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చారు. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ లో 4G, 5G, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ బరువు సుమారు 226 గ్రాములు కాగా, దీని సైజ్ 163.45 x 78.27 x 8.46 mm గా చాలా కాంపాక్ట్‌గా డిజైన్ చేశారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Vivo X300e : ఫోటోగ్రఫీ లవర్లకు పూనకాలే.. కెమెరా సెన్సార్లతో మార్కెట్‌ను ఊపేస్తున్న వివో నయా ఫోన్
  2. iPhone Ultra : అన్‌ఫోల్డ్ చేస్తే ఐప్యాడ్.. ఫోల్డ్ చేస్తే ఐఫోన్.. యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్
  3. Lenovo Legion 27-1r : లెనోవో నుంచి అదిరిపోయే గేమింగ్ మానిటర్.. గేమర్స్ ఇక తిండి తిప్పలు మానడం ఖాయం
  4. Redmi 17 4G : మార్కెట్‌లోకి రెడ్‌మీ 17 4జి.. లాంచ్‌కు ముందే లీకైన ఫీచర్లు
  5. Ugreen 100W Mini Ice GaN Charger : క్రెడిట్ కార్డ్ సైజులో 100W సూపర్ ఛార్జర్.. చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
  6. Crypto : దేశంలో క్రిప్టో కరెన్సీపై మళ్లీ మొదలైన చర్చ.. నిబంధనలు లేవు కానీ.. టాక్స్ రూల్స్ మాత్రం పక్కా
  7. iQOO Z11 Lite vs Realme Narzo 100x 5G vs Moto G77 Power: మీ బడ్జెట్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
  8. xMEMS Labs Microfan : స్మార్ట్ టెక్నాలజీ చరిత్రలోనే అద్భుత విప్లవం.. చేతి గోరు సైజులో మైక్రో ఫ్యాన్ ఆవిష్కరణ
  9. Indian Railways : బెడ్‌షీట్‌పై చిన్న మచ్చ ఉన్నా ఇక ఏఐ పట్టేస్తుంది.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
  10. Stuffcool Omni Pro Powerbank : జేబులో పట్టేంత సైజ్.. పర్ఫామెన్సులో మాత్రం పవర్‌హౌస్.. మార్కెట్లోకి కొత్త పవర్ బ్యాంక్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »