Urtopia Carbon Atom : సింగిల్ ఛార్జ్‌తో 95 కిమీ రేంజ్.. మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్

ప్రస్తుతానికి ఈ అర్టోపియా కార్బన్ ఆటమ్ ఎలక్ట్రిక్ బైక్‌ను అమెరికా మార్కెట్‌లో విడుదల చేశారు.

Urtopia Carbon Atom : సింగిల్ ఛార్జ్‌తో 95 కిమీ రేంజ్.. మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్

Photo Credit: Urtopia

Urtopia Carbon Atom

ముఖ్యాంశాలు
  • ఈవీ మార్కెట్లోకి అర్టోపియా సంచలన ఎంట్రీ
  • బరువు తక్కువ, బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్!
  • సరికొత్త 'కార్బన్ ఆటమ్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్
ప్రకటన

Urtopia Carbon Atom : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అర్టోపియా మార్కెట్లోకి సరికొత్త హై-పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకువచ్చింది. అర్టోపియా కార్బన్ ఆటమ్ పేరుతో లాంచ్ అయిన ఈ ఈ-బైక్ స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఫీచర్లతో రైడర్లను ఆకట్టుకుంటోంది. ఈ బైక్ బరువు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, దీని బాడీ బిల్డ్ క్వాలిటీ మాత్రం అత్యంత బలంగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్స్ ఇష్టపడే వారి కోసం సరికొత్త టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు.

 ఉచిత యాక్సెసరీలతో పాటు అదిరిపోయే కలర్ ఆప్షన్లు 
ప్రస్తుతానికి ఈ అర్టోపియా కార్బన్ ఆటమ్ ఎలక్ట్రిక్ బైక్‌ను అమెరికా మార్కెట్‌లో విడుదల చేశారు. అక్కడ దీని ధరను $2,499 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన దేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.2,35,000 వరకు ఉంటుంది. ఈ బైక్ కొనుగోలు చేసే కస్టమర్లకు అదనపు ప్రయోజనంగా మడ్‌గార్డ్స్, కిక్‌స్టాండ్‌ను కంపెనీ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. కలర్స్ విషయానికి వస్తే, ఈ బైక్ మూన్‌లైట్, కాపర్, ఆలివ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. ఆసక్తి గల కస్టమర్లు దీనిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.

750 వాట్ల పవర్‌ఫుల్ మోటార్ 
ఈ ఎలక్ట్రిక్ బైక్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో 750 వాట్ల నిరంతర అవుట్‌పుట్ ఇచ్చే పవర్‌ఫుల్ హబ్ మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 1,250 వాట్ల పీక్ అవుట్‌పుట్‌ను, 90 Nm వరకు అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఎంతటి కఠినమైన రోడ్లు లేదా కొండ ప్రాంతాలనైనా ఈ బైక్ చాలా సులభంగా దూసుకెళ్లిపోతుందన్నమాట. ఇక బరువు విషయానికి వస్తే, ఎలాంటి అదనపు యాక్సెసరీస్ లేకుండా ఈ బైక్ మొత్తం బరువు కేవలం 58 పౌండ్లు అంటే దాదాపు 26 కిలోగ్రాములు మాత్రమే ఉంటుంది. కార్బన్ ఫ్రేమ్‌తో తయారు చేయడం వల్ల ప్రయాణంలో వచ్చే వైబ్రేషన్స్  చాలా వరకు తగ్గిపోతాయి.
 

Apple Price Hike : ఇండియాలో మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ల ధరలను భారీగా పెంచిన యాపిల్.. ఏకంగా రూ.1,00,000 వరకు పెంపు

ఒక్క ఛార్జ్‌తో 95 కిలోమీటర్ల ప్రయాణం 
ఈ కార్బన్ ఆటమ్ ఈ-బైక్‌లో లాంగ్ రైడ్స్ కోసం ఏకంగా 802 Wh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే నాన్-స్టాప్‌గా 95 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని కంపెనీ గట్టిగా చెబుతోంది. అంతేకాకుండా, ప్రయాణాన్ని మరింత సులువుగా మార్చడానికి ఇందులో 8-స్పీడ్ షిమనో ఎసెరా డెరైలర్ గేర్ సిస్టమ్‌ను అందించారు. అలాగే వేగాన్ని అదుపులో ఉంచడానికి అత్యంత సురక్షితమైన టెక్ట్రో హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లను రెండు వైపులా అమర్చారు.

 సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అడ్వాన్స్డ్ ఫీచర్లు 
రైడర్ల సౌకర్యం కోసం ఈ బైక్ ముందు భాగంలో 80 మిమీ ట్రావెల్ సామర్థ్యం గల సస్పెన్షన్ ఫోర్క్‌ను ఇచ్చారు. ఈ బైక్‌కు వెనుక వైపు ఎలాంటి సస్పెన్షన్ లేనప్పటికీ, సీటు కింద ప్రత్యేకంగా  సస్పెన్షన్ సీట్‌పోస్ట్ అందించడం వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం చాలా స్మూత్‌గా సాగుతుంది. రైడర్ కోసం హ్యాండ్ బార్ మధ్యలో 3.5 ఇంచుల కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అమర్చారు, ఇది స్పీడ్, బ్యాటరీ లెవెల్ వంటి వివరాలను చూపిస్తుంది. ఇందులో 26 ఇంచుల పెద్ద కెండా టైర్లతో పాటు రాత్రి వేళల్లో ప్రయాణించడానికి వీలుగా పవర్‌ఫుల్ హెడ్‌లైట్, ఇంటిగ్రేటెడ్ రియర్ లైట్లను కూడా జోడించారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung : శామ్‌సంగ్ లవర్స్‌కు రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్.. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7ఎఫ్ఈ 5జీపై భారీ డిస్కౌంట్
  2. Phone Comparison : మార్కెట్లోకి వీవో ఎక్స్ ఫోల్డ్ 6 ఎంట్రీ.. గూగుల్, శామ్‌సంగ్ ఫోన్లకు గట్టి పోటీ
  3. Vodafone Idea : వోడాఫోన్ ఐడియా అదిరిపోయే ఆఫర్.. రూ.202లకే 5జీ డేటాతో పాటు ఓటీటీల జాతర
  4. Urtopia Carbon Atom : సింగిల్ ఛార్జ్‌తో 95 కిమీ రేంజ్.. మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్
  5. Samsung : మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 సిరీస్.. బరువు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
  6. Sony Layoffs : గేమర్లకు బ్యాడ్ న్యూస్.. ప్రసిద్ధ బంగీ స్టూడియోలో భారీగా ఉద్యోగులను తీసేసిన సోనీ
  7. AC Maintenance : ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే చాలు.. కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గిపోవడం ఖాయం
  8. Flipkart Goat Sale : జూలై 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్.. ఐఫోన్ 17 సిరీస్‌పై ఊహించని రేంజ్‌లో భారీ తగ్గింపులు
  9. Apple Price Hike : ఇండియాలో మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ల ధరలను భారీగా పెంచిన యాపిల్.. ఏకంగా రూ.1,00,000 వరకు పెంపు
  10. OnePlus : బడ్జెట్ ఫోన్లలోనూ 185Hz డిస్‌ప్లే టెక్నాలజీ.. సరికొత్త ప్లాన్‌తో వస్తున్న వన్‌ప్లస్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »