మీ ఫోన్‌కు అందుతున్న సిగ్నల్స్ ఆధారంగా గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్ గురించి ఎంత ఖచ్చితంగా ఉందో తెలియజేస్తుంది.
Photo Credit: Pexels/Theo Decker
Google Maps
Google Maps : ప్రస్తుత రోజుల్లో ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించాలన్నా, తెలియని అడ్రస్‌లను వెతకాలన్నా ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. మనం ఉన్న చోటు నుంచి వెళ్లాల్సిన గమ్యస్థానానికి సంబంధించిన రూట్‌ను ఈ యాప్ స్పష్టంగా చూపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు యూజర్ ప్రస్తుత స్థానాన్ని చూపించడానికి యాప్‌లో ఒక బ్లూ డాట్ కనిపిస్తుంది. అయితే చాలామంది గమనించే ఉంటారు.. ఆ బ్లూ డాట్ చుట్టూ ఒక నీలి రంగు సర్కిల్ కూడా ఉంటుంది. ఆ సర్కిల్ సైజు మారుతూ ఉంటుంది. అసలు ఆ బ్లూ సర్కిల్ ఎందుకు వస్తుంది, గూగుల్ మన ఖచ్చితమైన లొకేషన్‌ను ఎలా గుర్తిస్తుందో వివరంగా తెలుసుకుందాం.
యాప్ ఉపయోగిస్తున్నప్పుడు ఆ బ్లూ డాట్ పరిమాణం పెద్దదిగా లేదా చిన్నదిగా మారడం దేనికి సంకేతమంటే.. మీ ఫోన్‌కు అందుతున్న సిగ్నల్స్ ఆధారంగా గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్ గురించి ఎంత ఖచ్చితంగా ఉందో తెలియజేస్తుంది. జీపీఎస్ శాటిలైట్లు, చుట్టుపక్కల ఉండే వై-ఫై నెట్‌వర్క్‌లు, మొబైల్ సెల్యులార్ టవర్ల కలయిక ద్వారా గూగుల్ మ్యాప్స్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తుంది. ఫోన్‌కు అందే సిగ్నల్స్ చాలా బలంగా, స్థిరంగా ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్‌ను 100 శాతం పర్ఫెక్ట్‌గా చూపిస్తుంది. ఒకవేళ సిగ్నల్స్ బలహీనంగా ఉన్నా లేదా నెట్‌వర్క్‌లో అంతరాయం ఏర్పడినా.. యాప్ తన అంచనాలో ఉన్న లోపాన్ని చూపించడానికి ఆ బ్లూ డాట్ చుట్టూ ఒక పెద్ద బ్లూ సర్కిల్‌ను డిస్‌ప్లే చేస్తుంది.
లొకేషన్ మార్కర్ చుట్టూ ఉండే బ్లూ సర్కిల్ చిన్నగా ఉంటే గూగుల్ మ్యాప్స్ మీ స్థానాన్ని చాలా ఖచ్చితంగా గుర్తించిందని అర్థం. అదే సర్కిల్ పెద్దగా ఉంటే.. యాప్ చూపిస్తున్న ఖచ్చితమైన పాయింట్‌లో కాకుండా, ఆ హైలైట్ చేసిన సర్కిల్ పరిధిలో ఎక్కడో ఒకచోట యూజర్ ఉన్నారని అర్థం. అంటే ఆ జోన్ లోపల మీరు ఉన్నారని గూగుల్ మ్యాప్స్ తన విజువల్ ఇండికేటర్ ద్వారా సూచిస్తుంది. చుట్టుపక్కల వాతావరణం సరిగ్గా లేనప్పుడు లేదా ఎత్తైన కొండలు, దట్టమైన చెట్ల వల్ల జీపీఎస్ సిగ్నల్‌కు ఆటంకం కలిగినప్పుడు, అలాగే ఫోన్‌కు లొకేషన్ డేటా సేకరించడానికి వనరులు తక్కువగా ఉన్నప్పుడు ఈ సర్కిల్ సైజు పెద్దదవుతుంది.
Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సరికొత్త సంచలనం.. జూలై 14న రెడ్‌మి నోట్ 17 సిరీస్ గ్రాండ్ లాంచ్
గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ అక్యురెసీ (సరిగ్గా చూపించే సామర్థ్యం) తగ్గడానికి పలు రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద కాంక్రీట్ భవనాల లోపలికి వెళ్లినప్పుడు, అండర్‌గ్రౌండ్ (భూగర్భం)లో ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఎత్తైన బిల్డింగ్స్ ఉన్న ఏరియాల గుండా వెళ్లేటప్పుడు శాటిలైట్ నుంచి వచ్చే జీపీఎస్ సిగ్నల్స్ బ్లాక్ అయిపోతాయి లేదా చాలా బలహీనపడతాయి. అటువంటి సమయాల్లో గూగుల్ మ్యాప్స్ మీ కరెక్ట్ లొకేషన్‌ను కనుగొనడంలో ఇబ్బంది పడుతుంది. దీనివల్ల రూట్ మ్యాప్ సరిగ్గా పనిచేయకపోవడం లేదా తప్పుడు మార్గాన్ని చూపించడం లాంటివి జరుగుతుంటాయి.
మీ మొబైల్‌లో గూగుల్ మ్యాప్స్ లొకేషన్ మరింత ఖచ్చితంగా పనిచేయాలంటే కొన్ని సులువైన చిట్కాలను పాటించవచ్చు. మొదటిది మీ ఫోన్‌లో వై-ఫై ఆప్షన్‌ను ఎల్లప్పుడూ ఆన్ చేసి ఉంచండి. మీరు ఏ వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కాకపోయినప్పటికీ, చుట్టుపక్కల ఉండే వై-ఫై రూటర్ల సిగ్నల్స్ సాయంతో గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్‌ను సులువుగా అర్థం చేసుకుంటుంది. రెండవది, మీ ఫోన్‌లోని కంపాస్ సెన్సార్‌ను రీ-క్యాలిబ్రేట్ చేయడం కోసం ఫోన్‌ను చేతిలో పట్టుకుని గాల్లో ఇంగ్లీష్ నంబర్ ‘8' ఆకారంలో తిప్పండి. ఇలా చేయడం వల్ల ఫోన్ సెన్సార్లు మళ్లీ సరిగ్గా సెట్ అయ్యి లొకేషన్ ఖచ్చితత్వం పెరుగుతుంది. వీలైనంత వరకు ఓపెన్ ప్లేస్ లోకి రావడం వల్ల ఫోన్‌కు జీపీఎస్ శాటిలైట్ సిగ్నల్స్ నేరుగా అంది, ఆ పెద్ద బ్లూ సర్కిల్ కాస్తా చిన్నగా మారిపోతుంది.
ప్రకటన
ప్రకటన