Dopamine Shopping: షాపింగ్ ఫ్రీ భయ్యా.. కానీ ఒక్క వస్తువు కూడా ఇంటికి రాదు.. సౌత్ కొరియాలో కొత్త ట్రెండ్

Fake E-Commerce Sites for Mental Peace & Stress relief: మన మెదడులో ఆనందాన్ని కలిగించే డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేయడమే ఈ సైట్ల ముఖ్య ఉద్దేశం. ఇక్కడికి వెళ్లి మనం చేసే షాపింగ్ ప్రక్రియ మొత్తం నిజమైన ఆన్‌లైన్ షాపింగ్ లాగే అనిపిస్తుంది.

Dopamine Shopping: షాపింగ్ ఫ్రీ భయ్యా.. కానీ ఒక్క వస్తువు కూడా ఇంటికి రాదు.. సౌత్ కొరియాలో కొత్త ట్రెండ్

Photo Credit: Unsplash/freestocks

Dopamine Shopping

ముఖ్యాంశాలు
  • సౌత్ కొరియాలో క్రేజీ డోపమైన్ షాపింగ్ ట్రెండ్
  • మనశ్శాంతి కోసం నకిలీ షాపింగ్ చేస్తున్న యువత!
  • ఆర్డర్ స్టేటస్ కనిపిస్తుంది కానీ డెలివరీ కాదు
ప్రకటన

Fake E-Commerce Sites for Mental Peace and Stress relief: మీరు జేబులోంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా, ఎలాంటి క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టకుండా మీకు నచ్చిన వస్తువులను మనసారా షాపింగ్ చేయవచ్చని తెలిస్తే ఎంత బాగుంటుంది కదా. ప్రస్తుతం సౌత్ కొరియాలోని యువత సరిగ్గా ఇలాంటి ఒక వింత ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. అక్కడ జీవనశైలిలో ఒత్తిడిని, టెన్షన్లను తగ్గించుకోవడానికి డోపమైన్ సైట్స్ అనే ప్రత్యేకమైన వెబ్‌సైట్లను యువత విపరీతంగా ఆశ్రయిస్తున్నారు. ఈ సైట్లు కేవలం మనుషులకు మానసిక ప్రశాంతతను, తాత్కాలిక సంతోషాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తుండటం విశేషం.

ఈ డోపమైన్ సైట్ల పేరులోనే అసలు మ్యాజిక్ అంతా దాగి ఉంది. మన మెదడులో ఆనందాన్ని కలిగించే డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేయడమే ఈ సైట్ల ముఖ్య ఉద్దేశం. ఇక్కడికి వెళ్లి మనం చేసే షాపింగ్ ప్రక్రియ మొత్తం నిజమైన ఆన్‌లైన్ షాపింగ్ లాగే అనిపిస్తుంది. వస్తువులను ఎంచుకోవడం, కార్ట్‌లో వేయడం, పేమెంట్ పేజీ వరకు వెళ్లడం అన్నీ ఒరిజినల్‌లానే ఉంటాయి. కానీ ఆఖరిలో మనం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆర్డర్ పూర్తయినట్లు స్క్రీన్ పై స్టేటస్ కనిపిస్తుంది కానీ ఎలాంటి వస్తువు కూడా మన ఇంటికి డెలివరీ కాదు.

Telegram : నీట్ ఎగ్జామ్ ముందర కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం

సౌత్ కొరియాలోని జెన్ జీ తరానికి చెందిన యువతీ యువకులు కేవలం మానసిక ఉపశమనం కోసం మాత్రమే ఇటువంటి నకిలీ షాపింగ్ అలవాట్లను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫేక్ డెలివరీ యాప్స్, ఆన్‌లైన్ స్మోక్ బ్రేక్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ వారు రిలాక్స్ అవుతున్నారు. రోజువారీ జీవితంలో ఉండే విపరీతమైన స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి తమకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ లేదా వస్తువులను వెతికి కార్ట్‌లో వేసుకుంటారు. నిజంగా వస్తువులను కొనకపోయినా, కొన్నామనే ఒక తృప్తిని ఈ ప్రక్రియ వారి మెదడుకు కలిగిస్తుంది. దీనివల్ల ఎలాంటి ఆర్థిక నష్టం లేకుండానే మనసుకు హాయిగా అనిపిస్తుంది.

ఈ డోపమైన్ వెబ్‌సైట్లు చూడటానికి హూబహూ మన దేశంలోని జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల లాగే కనిపిస్తాయి. సాధారణంగా చాలా మందికి అర్ధరాత్రి పూట రకరకాల వంటకాలు తినాలనే కోరిక కలుగుతుంది. అలాంటప్పుడు ఈ యాప్స్ ఓపెన్ చేసే కొరియన్ యూజర్లు.. మెనూ లోని రుచికరమైన పదార్థాలను ఎంచుకుని కార్ట్‌లో వేసి ఆర్డర్ ప్రాసెస్ పూర్తి చేస్తారు. తాము నిజంగానే ఫుడ్ ఆర్డర్ చేశామనే భ్రమను ఈ యాప్ కల్పిస్తుంది. ఈ వింత అలవాటు వల్ల అర్ధరాత్రి పూట అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ తినే అలవాటు తగ్గిందని, తద్వారా డైటింగ్ కంట్రోల్ లో ఉంటోందని పలువురు యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »