Instagram : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. వివాదాస్పద ఏఐ ఇమేజ్ ఫీచర్‌ను వెనక్కి తీసుకున్న మెటా

మెటా సంస్థ ఈ వివాదాస్పద నిర్ణయంపై అధికారికంగా స్పందిస్తూ తమ బ్లాగ్ పోస్ట్‌లో వివరాలను వెల్లడించింది.

Instagram : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. వివాదాస్పద ఏఐ ఇమేజ్ ఫీచర్‌ను వెనక్కి తీసుకున్న మెటా

Photo Credit: Pexels/ Brian Ramirez

Meta Muse Image

ముఖ్యాంశాలు
  • ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్
  • వివాదాస్పద ఏఐ (AI) ఇమేజ్ ఫీచర్‌ను వెనక్కి తీసుకున్న మెటా
  • వేరేవాళ్ల అకౌంట్‌ను ట్యాగ్ చేస్తే చాలు వాళ్ల ఏఐ బొమ్మలు ప్రత్యక్షం
ప్రకటన

Instagram : సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ తమ యూజర్ల ప్రైవసీ రక్షణ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ సరికొత్త ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్  మ్యూజ్ ఇమేజ్‎లో ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక ఫీచర్‌ను లాంచ్ చేసిన కొద్ది రోజులకే ప్లాట్‌ఫారమ్ నుంచి పూర్తిగా తొలగించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. దీనికి కారణం.. ఈ ఫీచర్ సాయంతో ఎవరైనా సరే, కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ అకౌంట్ ఉన్న యూజర్ల ప్రొఫైల్‌ను ట్యాగ్ చేసి, వాళ్లకు నచ్చిన ప్రాంప్ట్ ఇస్తే చాలు, సదరు యూజర్ల ముఖ కవళికలతో కూడిన సరికొత్త ఏఐ చిత్రాలను సృష్టించే వీలుండేది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రైవసీ ఆందోళనలు వ్యక్తమవడంతో మెటా స్పందించి, ఈ నిర్ణయం సరైనది కాదని ఒప్పుకుంటూ ఫీచర్‌ను రద్దు చేసింది.

హాలీవుడ్ సెలబ్రిటీల నుంచి తీవ్ర నిరసనలు 
మెటా సంస్థ ఈ వివాదాస్పద నిర్ణయంపై అధికారికంగా స్పందిస్తూ తమ బ్లాగ్ పోస్ట్‌లో వివరాలను వెల్లడించింది. వినియోగదారులకు మరింత క్రియేటివ్ టూల్‌ను అందించాలనే ఉద్దేశంతోనే దీనిని తీసుకొచ్చామని, అలాగే తమ పబ్లిక్ కంటెంట్‌ను ఏఐ కోసం వాడాలా వద్దా అనే ఆప్షన్ కూడా ఇచ్చామని పేర్కొంది. అయితే, ఈ ఫీచర్ నెటిజన్ల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోగా, తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ సెలబ్రిటీలు ఈ ఫీచర్ వల్ల సెలబ్రిటీల ఫోటోలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని బహిరంగంగా విమర్శించారు. కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా ఈ ఫీచర్ లేదని భావించిన మెటా, వెంటనే దీనిని ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేసింది.

పబ్లిక్ అకౌంట్ ఉంటే డిఫాల్ట్‌గా మీ ఫోటోలు వాడేలా ప్లాన్ 
ఈ సరికొత్త ఏఐ ఫీచర్ ఇంత పెద్ద వివాదానికి దారితీయడానికి ప్రధాన కారణం మెటా సంస్థ పెట్టిన రూల్స్. ఎవరికైతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పబ్లిక్‌గా ఉంటుందో, వారందరినీ ఈ ఫీచర్‌లో ఆటోమేటిక్‌గా చేర్చేశారు. అంటే, తమ ఫోటోలతో ఇతరులు ఏఐ చిత్రాలను తయారు చేయడం ఇష్టం లేని వారు.. స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆ ఆప్షన్‌ను మాన్యువల్‌గా ఆఫ్ చేసుకోవాల్సి వచ్చేది. అంతేకాకుండా, మీ అనుమతి లేకుండా వేరే ఎవరో ఒకరు మీ ఫోటోలను వాడుకుని ఏఐ ఇమేజ్ క్రియేట్ చేసినా, ఆ సమాచారం ఒరిజినల్ అకౌంట్ హోల్డర్‌కు తెలిసేలా ఎలాంటి నోటిఫికేషన్ వ్యవస్థను కూడా మెటా ఏర్పాటు చేయలేదు.

Crypto Currency : క్రిప్టో కరెన్సీపై పాకిస్తాన్‌లో సంచలన ఫత్వా.. షరియా చట్టం ప్రకారం ఇది పూర్తిగా నిషిద్ధం

మైనర్ అకౌంట్లు, ప్రైవేట్ ప్రొఫైళ్లకు మొదటి నుంచీ రక్షణ 
ఒకరి స్పష్టమైన అనుమతి లేకుండా వారి ముఖచిత్రాలను ఏఐ టూల్స్ ద్వారా మార్చడం వల్ల డీప్‌ఫేక్స్ వంటి సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మెటా సంస్థ ఈ ఫీచర్‌ను డిజైన్ చేసినప్పుడే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్ల అకౌంట్లను, అలాగే ప్రైవేట్ మోడ్‌లో ఉంచుకున్న ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైళ్లను ఈ ఫీచర్ పరిధి నుండి పూర్తిగా మినహాయించింది. అయినప్పటికీ, పబ్లిక్ అకౌంట్లు ఉన్న కోట్ల మంది సాధారణ యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతుందనే కారణంతో ఈ ఫీచర్ తీవ్ర విమర్శల పాలైంది.

ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్స్‌లో ఆ ఆప్షన్ క్లోజ్ 
ఈ వివాదాస్పద ఫీచర్‌ను శాశ్వతంగా తొలగించడంతో పాటు, మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్స్ లోపల ఒక కీలక మార్పు చేసింది. గతంలో పబ్లిక్ అకౌంట్ల కోసం అందుబాటులో ఉంచిన "Allow people to reuse your content on Instagram and with AI features on Meta" అనే టాగుల్ బటన్‌ను సెట్టింగ్స్ మెనూ నుండి పూర్తిగా తీసివేసింది. ప్రస్తుతానికి కేవలం వివాదాలకు కారణమైన ఈ అకౌంట్ ట్యాగింగ్ ఏఐ ఇమేజ్ ఫీచర్‌ను మాత్రమే మెటా నిలిపివేసింది. అయితే, వినియోగదారులు సాధారణంగా టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఉపయోగించి కొత్త చిత్రాలను సృష్టించుకునే మ్యూజ్ ఏఐలోని మిగతా ఇమేజ్ జనరేషన్ ఫీచర్లను ఎప్పటిలాగే ఉచితంగా వాడుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »