వాట్సాప్ తన కొత్త ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ v2.26.25.3 ని విడుదల చేసింది.
Photo Credit: WhatsApp
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. యూజర్ల చాటింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే క్రమంలో సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేసే ఆప్షన్‌లో వాట్సాప్ సరికొత్త మార్పును తీసుకొచ్చింది. ఈ మార్పు వల్ల మెసేజ్‌లను ఎడిట్ చేయడం మునుపటి కంటే చాలా సులభం కాబోతోంది. టెక్స్ట్ మెసేజ్‌లలోని తప్పులను సరిదిద్దే ప్రక్రియను మరింత సరళం చేస్తూ ఈ సరికొత్త షార్ట్‌కట్‌ను ప్రవేశపెట్టారు.
మారిన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్
వాట్సాప్ తన కొత్త ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ v2.26.25.3 ని విడుదల చేసింది. ఈ వెర్షన్‌లోనే మెసేజ్ ఎడిటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. సాధారణంగా వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు అందులో ఏవైనా స్పెల్లింగ్ తప్పులు ఉంటే.. మెసేజ్ పంపిన 15 నిమిషాల లోపు ఆ తప్పులను సరిదిద్దుకునే సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. దీనికోసం పంపిన మెసేజ్‌ను పూర్తిగా డిలీట్ చేయాల్సిన అవసరం గానీ, మళ్లీ కొత్తగా టైప్ చేయాల్సిన అవసరం గానీ ఉండదు. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను మరింత సులభతరం చేస్తూ వాట్సాప్ కొత్త షార్ట్‌కట్ డిజైన్‌ను తీసుకొచ్చింది.
ఒక్క స్టెప్ శ్రమ తగ్గింది
కొత్త అప్‌డేట్ ప్రకారం, మెసేజ్‌ను ఎడిట్ చేయడానికి యూజర్లు ఇప్పుడు ఒక స్టెప్ తక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్‌లో మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న మెసేజ్ మీద నొక్కి పట్టుకుంటే, స్క్రీన్‌పై నేరుగా వచ్చే పాప్-అప్ మెనూలోనే ఎడిట్ ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది. అక్కడి నుంచే నేరుగా మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం కలిసి రావడమే కాకుండా చాలా త్వరగా తప్పులను మార్చుకోవడానికి వీలవుతుంది.
Amazon Now : అమెజాన్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. ఇకపై 300కు పైగా నగరాల్లో నిమిషాల్లోనే హోమ్ డెలివరీ
పాత పద్ధతికి గుడ్ బై
ఇంతకుముందు వాట్సాప్‌లో మెసేజ్ ఎడిట్ చేయాలంటే ప్రక్రియ ఇంత సులభంగా ఉండేది కాదు. యూజర్ మొదట ఆ మెసేజ్‌ను సెలెక్ట్ చేసి హోల్డ్ చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత స్క్రీన్ పైభాగంలో కుడి వైపున కనిపించే త్రీ-డాట్ మెనూ పై క్లిక్ చేయాల్సి ఉండేది. ఆ మెనూ లోపల ఉన్న ఆప్షన్లలో Editను ఎంచుకున్నాకే మెసేజ్ బాక్స్ ఓపెన్ అయ్యేది. అయితే ఇప్పుడు ఈ త్రీ-డాట్ మెనూతో పనిలేకుండా, ఎడిట్ ఆప్షన్‌ను నేరుగా పాప్-అప్ మెనూలోనే బయటకు తీసుకువచ్చారు. దీనివల్ల చిటికెలో మెసేజ్ ఎడిటింగ్ పూర్తవుతుంది.
కొత్త పద్ధతిలో మెసేజ్ ఎలా ఎడిట్ చేయాలి?
స్టెప్ 1: మొదట మీరు వాట్సాప్ చాట్‌లో మార్చాలనుకుంటున్న లేదా తప్పుగా పంపిన మెసేజ్‌ను సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 2: మెసేజ్‌ను నొక్కి పట్టుకోగానే, మీ మొబైల్ స్క్రీన్‌పై నేరుగా ఒక కొత్త పాప్-అప్ మెనూ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 3: ఆ మెనూలోనే మీకు Edit అనే ఆప్షన్ స్పష్టంగా కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేయండి.
స్టెప్ 4: Edit పై క్లిక్ చేయగానే కింద ఎడిట్ మెసేజ్ బార్ ఓపెన్ అవుతుంది. అక్కడ తప్పులను సరిచేసి వెంటనే సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే సాధారణ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999