లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో కీబోర్డ్ కనెక్షన్ కోసం పోగో-పిన్ కనెక్టర్‌లను కలిగి ఉంది. లెనోవా స్మార్ట్ కంట్రోల్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో స్మార్ట్ ఫోన్‌లకు, PCలకు దీనిని కనెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది
Photo Credit: Lenovo
లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో లూనా గ్రే రంగులో అందించబడుతుంది.
లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో భారత్‌లో లాంఛ్ అయ్యింది. ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్ 12GB వరకు RAMతో అటాచ్ చేయబడిన MediaTek Dimensity 8300 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. ఇది 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 10,200mAh బ్యాటరీని, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో క్వాడ్ JBL స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది లెనోవా ట్యాబ్ పెన్ ప్లస్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే, కీబోర్డ్ కనెక్షన్ కోసం పోగో-పిన్ కనెక్టర్‌లను కలిగి ఉంది. ఈ ట్యాబ్ లెనోవా స్మార్ట్ కంట్రోల్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో వినియోగదారులు వారి స్మార్ట్ ఫోన్‌లకు, PCలకు దీనిని కనెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
భారత్‌లో లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో 8GB + 128GB వేరియంట్ ధర రూ. 27,999 నుండి ప్రారంభమవుతుంది. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 30,999 వద్ద లిస్టవుట్ చేయబడింది. ఈ ట్యాబ్ ప్రస్తుతం లెనోవా ఇండియా ఈ-స్టోర్ ద్వారా ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. అమెజాన్ మైక్రోసైట్‌లోని బ్యానర్ మార్చి 21న ఈ-కామర్స్ సైట్‌లో అమ్మకానికి వస్తుందని స్పస్టం చేసింది. ఇది లూనా గ్రే కలర్‌లో లభించనుంది.
లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో 12.7-అంగుళాల 3K (1,840x2,944 పిక్సెల్స్) LTPS LCD స్క్రీన్‌ను 144Hz రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్, 273ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఈ ట్యాబ్ ప్రాసెసర్‌తో అటాచ్ చేయబడి 12GB వరకు RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రానుంది. ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత లెనోవా ZUI 16తో వస్తోంది. ట్యాబ్ ఆండ్రాయిడ్ 16 వరకు రెండు OS అప్‌గ్రేడ్‌లను, 2029 వరకు నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకుంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, ముందు 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అందించారు. ట్యాబ్‌లో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో క్వాడ్ JBL స్పీకర్స్ అమర్చబడి ఉంటాయి. దీని accessoriesలో లెనోవా ట్యాబ్ పెన్ ప్లస్ స్టైలస్, ట్యాబ్ ప్రో 2-ఇన్-1 కీబోర్డ్, ఫోలియో కేస్ ఉన్నాయి. ట్యాబ్‌లో కీబోర్డ్ కోసం త్రీ-పాయింట్ పోగో-పిన్ కనెక్టర్ ఉంది.
లెనోవా స్మార్ట్ కంట్రోల్ ఫీచర్‌లో షేర్ హబ్, క్రాస్ కంట్రోల్, యాప్ స్ట్రీమింగ్, స్మార్ట్ క్లిప్‌బోర్డ్ ఉన్నాయి. దీంతో ఫైల్‌లను షేర్ చేయడానికి, manage controls, యాప్‌లను ఉపయోగించడానికి, PCలు, స్మార్ట్ ఫోన్‌ల వంటి కనెక్ట్ చేయబడిన డివైజ్‌లలో కంటెంట్‌ను కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. కనెక్టివిటీ ఆప్షన్స్‌లో Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, USB టైప్-C 3.2 Gen1 పోర్ట్ వంటివి ఉన్నాయి. authentication కోసం ట్యాబ్‌కు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇది 291.8x189.1x6.9mm పరిమాణంలో 615గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Vivo Pad 5c Launched With Snapdragon 8s Gen 3 Chipset, 10,000mAh Battery: Price, Specifications
Honor 600 Elite Listed on EMVCo Database Alongside Honor 600s and 600 Lite S Models, Could Launch Soon