జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచే ఆలోచనలో ఉన్నాయి.
Photo Credit: Jio, Airtel
Jio, Airtel
Mobile Tariff : దేశంలోని మొబైల్ వినియోగదారులకు గుండె దడ పుట్టించే వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రముఖ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి కారణాలతో ఇప్పటికే సగటు మానవుడు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ కూడా మరింత ప్రియం కానుండటం గమనార్హం.
15 శాతం పెంచేందుకు టెలికాం సంస్థల కసరత్తు
ప్రముఖ టెలికాం వార్తా సంస్థ టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచే ఆలోచనలో ఉన్నాయి. ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం కంపెనీల లాభాలను పెంచుకోవడమే కాకుండా, ఇటీవల దేశవ్యాప్తంగా విస్తరించిన 5G నెట్‌వర్క్ స్పెక్ట్రమ్ కోసం పెట్టిన భారీ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు గతంలో కూడా పలుమార్లు ధరలను పెంచినప్పటికీ, మార్కెట్లో తమ పట్టును నిలుపుకోవడానికి, సగటు రాబడిని (ARPU) పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఒకవైపు స్మార్ట్‌ఫోన్ల ధరల మంట.. మరోవైపు రీఛార్జ్ భారం
ప్రస్తుతం ధరల పెంపుపై టెలికాం కంపెనీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ వార్త మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం మొబైల్ వాడకం అనేది సామాన్యుడికి ప్రతి రకంగానూ భారంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా మెమొరీ చిప్‌ల కొరత కారణంగా ఇప్పటికే కొత్త స్మార్ట్‌ఫోన్ల ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, ఇప్పుడు దానికి తోడు రీఛార్జ్ ప్లాన్లు కూడా ఖరీదైనవిగా మారితే మొబైల్ ఫోన్ నిర్వహణ మరింత కష్టతరంగా మారుతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
HP : కేవలం 30 నిమిషాల్లో 50% ఛార్జింగ్.. భారత్‌లో పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ లాంచ్ చేసి హెచ్‌పీ
నెట్‌వర్క్ సమస్యలతో విసుగెత్తిన యూజర్లు
వినియోగదారులను మరింత కలవరపెడుతున్న విషయం ఏంటంటే, ఒకవైపు నెట్‌వర్క్ క్వాలిటీ సరిగా లేదంటూ దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్న తరుణంలో కంపెనీలు ఈ ధరల పెంపునకు సిద్ధమవ్వడం. జియో, ఎయిర్‌టెల్ వంటి పెద్ద నెట్‌వర్క్‌లను వాడుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్ అవ్వడం, సిగ్నల్స్ సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలను యూజర్లు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సేవలను మెరుగుపరచకుండా కేవలం ప్లాన్ల ధరలను పెంచడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Discord Says It Has Not Received Take-Two Subpoena Over GTA 6 Leaks as More Gameplay Clips Surface Online