ఆండ్రాయిడ్ 16పై కీలక అప్‌డేట్.. వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య వచ్చేస్తోంది
Google వెల్లడించిన వివరాల ప్రకారం.. Android 16 వెర్షన్ వచ్చే ఏడాది అంటే 2025 మొదిటి ఆరు నెలల్లో విడుదల కానుంది. అక్టోబర్‌లో రిలీజ్ అయిన పిక్సెల్ ఫోన్‌ల కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ మాదిరి కాకుండా Google తాజా అప్‌డేటెడ్ Android వెర్షన్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో పరిచయం చేయనుంది. ఈ సంవత్సరం చివరి నాటికి చిన్న చిన్న మార్పులతో విడుదల ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. దీని ఆదారంగా యాప్ స్టెబిలిటీని మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే, వినియోగదారులకు కొత్త ఫీచర్‌లను అందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ తరచుగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK) అందుబాటులో ఉంచుతోంది