సెల్ఫ్-రిపేర్ సపోర్ట్‌తో HMD Arc ఫోన్ వచ్చేసింది.. పూర్తి స్పెసిఫికేషన్స్ ఇవే
Finnish కంపెనీ నుంచి HMD Arc పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ థాయ్‌లాండ్‌లో విడుదలైంది. HMD Arc ప్రత్యేకమైన ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇది సెల్ఫ్-రిపేర్ సపోర్ట్‌తో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అంటే, డిస్ ప్లే, బ్యాటరీ వంటి స్పేర్‌పార్ట్స్‌ను సర్వీస్ చేసేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వినియోగదారులే మార్చుకునేలా అనుమతిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 60Hz HD+ డిస్‌ప్లే, 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్)పై రన్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లభ్యత, ధరకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను చూద్దాం