డిసెంబర్ 19న Motorola Razr 50D ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్‌లు ఇవే
జపాన్ మార్కెట్లోకి Motorola Razr 50D ఫోన్ వచ్చే వారం లాంచ్ కానుంది. అయితే, Motorola ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ విడుదల గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, లాంచ్ కోసం ఓ మైక్రోసైట్ జపనీస్ మొబైల్ ఆపరేటర్ NTT డొకోమో వెబ్‌సైట్‌లో విడుదల తేదీ, ధరతోపాటు స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఇందులో ఫోన్ డిజైన్‌తోపాటు కలర్ ఆప్షన్‌లను కూడా బహిర్గతం చేసింది. మన దేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న Razr 50 ఫోన్ మాదిరిగానే Motorola Razr 50D డిజైన్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ 6.9-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 3.6-అంగుళాల కవర్ స్క్రీన్‌తో రూపొందించబడింది