చైనా మార్కెట్‌లోకి OnePlus Ace 5 Pro, OnePlus Ace 5లు వచ్చేశాయి.. ధర ఎంతంటే
చైనాలో OnePlus Ace 5 Pro, OnePlus Ace 5 హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. ఈ కొత్త OnePlus Ace సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు గరిష్టంగా 16GB RAM, 1TB వరకు స్టోరేజీతో వస్తున్నాయి. ఇవి 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. అలాగే, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుండగా, Ace 5 మోడల్ మాత్రం స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో వస్తోంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ రెండూ చైనాలో కొనుగోలు చేసేందుకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి